ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... కరోనా  వైరస్ వ్యాప్తి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఉందన్న కారణంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇంకొన్ని రోజుల్లో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడాన్ని జగన్ సర్కార్ జీర్ణించుకోలేకపోతున్నది . దీంతో ఎన్నికల కమిషన్ పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నది  జగన్ సర్కారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి సంప్రదించకుండా స్థానిక ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది  జగన్ సర్కార్. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. 

 

 

 అయితే తాజాగా రాష్ట్రంలో  స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది జగన్ సర్కార్. ఆరు వారాలపాటు ఎన్నికలు వాయిదా పడడం జీర్ణించుకోలేకపోతున్న జగన్ సర్కారు... సుప్రీంకోర్టులో న్యాయం కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలి అంటూ  దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది  వైఎస్ జగన్మోహన్ రెడ్డి  సర్కారు. అయితే దీంట్లో పలు అంశాలను కూడా పొందుపరిచింది.  రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కేవలం ఎన్నికల కమిషనర్ సొంత నిర్ణయం తీసుకున్నారని... దీనిపై చర్యలు కూడా చేపట్టాలంటూ జగన్ సర్కార్ వెల్లడించింది. 

 

 

 అయితే దీనికి సంబంధించి జస్టిస్ లలిత్ ధర్మాసనం ముందు ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్ తరపు అడ్వకేట్. ఈ నేపథ్యంలో మంగళవారం కేసుల జాబితా లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ ను  కూడా చేర్చాలి అంటూ సుప్రీంకోర్టు రిజిస్టర్ ను  ఆదేశించారు జస్టిస్ లలిత్. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయండి వేసిన పిటిషన్ పై దేశ అత్యున్నత న్యాయస్థానంలో రేపు  విచారణ జరిగే అవకాశం ఉంది.మరి జగన్ సర్కార్ పిటిషన్ పై  సుప్రీం కోర్టు  ఏం తీర్పు ఇవ్వబోతుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: