రోడ్డు నియమాలు పాటించకుంటే ఫైన్ వేస్తారని అందరికి తెలుసు. కానీ రోడ్డు నియమాలు పాటించిన ఓ కారు యజమానికి చలానా పంపించారు. ఈ ఆసక్తికర సంఘటన విశాఖలో చోటు చేసుకుంది. హెల్మెట్ లేదంటూ కారు యజమానికి జరిమానా విధిస్తూ మొబైల్ కి ఎస్ఎంఎస్ వచ్చింది. హెల్మెట్ లేదని కారుకు చలానా విధించడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. మీరు చూస్తున్నది నిజమే. విశాఖపట్నంలో ఈ విచిత్రం జరిగింది. విశాఖ నగరంలోని అక్కిరెడ్డిపాలెంకు చెందిన కారు యజమానికి  రూ.135 చలానా విధించినట్లు మొబైల్‌కు మెసేజ్ వచ్చింది.

 

 

తన కారుపై చలానా ఉండటంతో యజమాని వెంటనే కారణం ఏంటా అని ఓసారి చెక్ చేసుకున్నాడు.. ఆ చలానా విధించడానికి కారణాన్ని చూసి అతడికి దిమ్మ తిరిగిందట. ఎందుకిలా జరిగిందని పోలీస్ యాప్ లో చూసుకునే సరికి ఎవరో ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ ఉన్న దృశ్యం కనబడింది. దింతో అతడికి ఒక్కసారిగా షాక్ తిన్నంత పని అయిందంట. కారు, బైక్ నెంబర్ ఇంచు మించు ఒకేలా ఉండటంతో పొరపాటు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇప్పుడు చలానా కట్టాలో లేదో అర్థం కావట్లేదని వారు వాపోయారు. ట్రాఫిక్‌ పోలీసులు ఈ-చలానా విషయంతో జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం అధికారులకు ఫిర్యాదు చేస్తానన్నారు.

 

 

 

రోడ్డు నియమాలు పాటించాలన్న చెప్పిన వారే చలానా విషయంలో అజాగ్రత్తగా ఉండటం ఏంటి అని కొందరు   మండిపడుతున్నారు. చలానా కట్టించుకోవడంలోను తీసుకునే జాగ్రత్త విధించటంలోనూ ఎందుకు ఉండదు అని అంటున్నారు. ట్రాఫిక్ నియమాలతో ఇలాంటి ఘటనలు గతంలో చాలానే జరిగాయి. హెల్మెట్ లేదని కారులకు చలానాలు వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసులు అజాగ్రత్తతోనే ఇలాంటివి జరుగుతున్నాయన్నారు. చలానాలు పంపే ముందు ఓసారి తనిఖీ చేసుకుంటే మంచిదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: