ఆంధ్రప్రదేశ్ లో మొన్నటి వరకు స్థానిక ఎన్నికల హడావుడి ఉన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనా వైరస్ ప్రభావంతో వణికిపోతుంది.  భారత్ లో కూడా ఇప్పటికే 80 కి పైగా కేసులు నమోదు అయ్యాయి.. ఇద్దరు మరణించారు.  ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా పడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్ కుమార్ ప్రకటించారు.  ఎన్నికలు వాయిదా వేయడంపై టీడీపీ ఇతర పార్టీలు స్వాగతించాయి.  కానీ వైసీపీ నేతలు మాత్రం అగ్గిలం మీద గుగ్గిలం అవుతున్నారు. ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు హాజరుకానున్నారు. మనం పేపర్ బ్యాలెట్స్ వాడుతున్న నేపథ్యంలో, అధిక సమయం పడుతుంది. మనుషులకు మనుషులు తగిలే అవకాశం ఎక్కువ ఉంది.

 

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా ముప్పు తప్పడం లేదు. అందుకే  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్ కుమార్ ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.  తాజాగా దీనిపై స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ది జనాలకు తెలిసిపోయిందని.. సంక్షేమ పథకాల అమలుతో ప్రజలు లబ్ది పొందుతున్నారని.. అందుకే మరోసారి వైసీపీని అఖండ విజయంతో గెలిపిస్తారని కొన్ని పార్టీల నేతలకు నిద్ర పట్టకుండా ఉందని ఆయన అన్నారు. 

 

కరోనా ప్రభావం ఉందన మాట వాస్తవమే అని అది ఎన్నికలు ఆపేంతగా లేదని భావిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా మరోసారి ఆయన చంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ‘బాబూ... ఆరు వారాలు కాదు, 60 వారాల తర్వాత స్థానిక ఎన్నికలు జరిగినా నీ అడ్రసు గల్లంతవక తప్పదు. వ్యవస్థల్లో నీ మనుషులున్నారు కదా అని ఎలక్షన్లు నిలిపి వేయించావ్. 5 వేల కోట్ల రూపాయల నిధులు రాకుండా చేసి ఐదు కోట్ల మంది ప్రజలకు ద్రోహం చేశావు. నీ నీచ రాజకీయాల చరమాంకానికి నువ్వే దారి వేసుకున్నావ్' అని విజయసాయిరెడ్డి విమర్శించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: