ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్ ఇప్పుడు ఏపీ మాజీ సీఎం, ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబు నాయుడుకు కూడా సోకిందా ?  చంద్ర‌బాబు కూడా క‌రోనాతో బాధ‌ప‌డుతున్నారా ?  అంటే వైసీపీ నేత‌లు అవుననే అంటున్నారు. ఇప్ప‌టికే సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల వాయిదా నేప‌థ్యంలో చంద్ర‌బాబుకు క‌రోనా వైర‌స్ సోకింద‌ని తీవ్రంగా విమ‌ర్శించారు. ఇప్పుడు వైసీపీ నేత‌లు సైతం బాబును తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లాకు చెందిన పెడ‌న వైసీపీ ఎమ్మెల్యే జోగి ర‌మేష్ సైతం చంద్ర‌బాబు పై తీవ్రంగా విరుచుకు ప‌డ్డారు.

 

బంధుత్వం ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి కానీ, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశంపై దెబ్బకొట్టడం చంద్ర‌బాబుకు త‌గ‌ద‌న్నారు. చంద్ర‌బాబుకు తొత్తులా నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని జోగి ఫైర్ అయ్యారు. ప్రభుత్వంతో చర్చించకుండా, హెల్త్‌ సెక్రటరీ, చీఫ్‌ సెక్రటరీలకు తెలియ‌కుండా క‌రోనా వైరస్‌ను సాకుడా చూపి ఆయ‌న ఎన్నిక‌లు వాయిదా వేశార‌ని.. ఇదంతా టీడీపీని కాపాడేందుకు జ‌రిగిన కుట్ర‌గా జోగి చెప్పారు.
ఇప్పుడు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు వాయిదా వేయ‌డంతో 14వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన రూ.5వేల కోట్లు రావ‌ని... ఇదంతా రాష్ట్ర అభివృద్ధికి విఘాత‌మ‌ని జోగి చ‌చెప్పారు.

 

ప్రజలు వైసీపీకి 151 సీట్లు ఇచ్చి అధికారంలోకి తీసుకువస్తే.. రాష్ట్రం అభివృద్ధి చెందకూడద‌ని.. ప్ర‌భుత్వంపై కుట్ర‌లు చేస్తూ బాబు పైశాచిక ఆనందం పొందుతున్నార‌ని జోగి విమ‌ర్శించారు. స్థానిక సంస్థల్లో టీడీపీ తరుఫున పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేర‌ని.. కేవ‌లం ఓట‌డి భ‌యంతోనే ఇప్పుడు ఎన్నిక‌లు వాయిదా వేయించార‌ని... సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న‌ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం కోసం ప్రయత్నిస్తుంటే.. చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ దుర్మార్గుల్లా అడ్డుపడుతున్నార‌ని జోగి ధ్వ‌జ‌మెత్తారు. ప‌త‌న‌మైన పార్టీకి అధ్య‌క్షుడిగా ఉన్న చంద్ర‌బాబు పార్టీకి రాజ‌కీయ భ‌విష్య‌త్తు లేద‌ని.. వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్ చేసి చంద్ర‌బాబు తాత్కాలిక ఆనందం పొందినా... ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా విజ‌యం మాత్రం వైసీపీదే అని జోగి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: