ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఎన్నికల సంఘం వాయిదా వేయడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే దీనిని తీవ్రంగా పరిగణించిన జగన్ సర్కార్... రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల సంఘం పై విమర్శలు కూడా గుప్పిస్తోంది. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికలు వాయిదా వేయడంపై వైసీపీ  నేతలు మండిపడుతున్నారు. ఇక తాజాగా ఇదే విషయమై మీడియా సమావేశం నిర్వహించిన స్పీకర్ తమ్మినేని సీతారాం.. ఎన్నికల సంఘం పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఎన్నికల అధికారి పరిపాలనలో కూడా జోక్యం చేసుకుంటే ఇక రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండడం ఎందుకు అంటూ ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ ప్రకటనతో రాష్ట్రంలోని ప్రజలు అందరూ నవ్వుకుంటున్నారు అంటూ విమర్శించారు. 

 

 

 కుంటి సాకులు చెప్పి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగకుండా వాయిదా వేశారు అంటూ ఆరోపించిన స్పీకర్ తమ్మినేని సీతారాం... రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరును రాష్ట్ర ప్రజలు అంత తప్పుబడుతున్నారు అంటూ విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే అధికారం మాత్రమే ఎన్నికల సంఘానికి ఉంటుంది అంటూ తెలిపారు స్పీకర్ తమ్మినేని సీతారాం. అంటే ఎన్నికలు జరిగే టప్పుడు ఏ కలెక్టర్ ఎక్కడ ఉండాలి అని ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది అంటూ తెలిపారు. కానీ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారు అంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. 

 

 

 కోర్టుల్లో  తీర్పులు ఆలస్యం అవడం వల్లే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ఆలస్యం అయ్యాయి అంటూ తెలిపారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్,  ఎన్నికల విధివిధానాలు,  ఎన్నికల నిర్వహణ అమలు చేయడం వరకే రాష్ట్రంలోని ఎన్నికల కమిషన్ పాత్ర ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ఒకవేళ ఎన్నికల సమయంలో జాతీయ విపత్తు ఏర్పడినప్పుడు ప్రభుత్వ యంత్రాంగంలో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలి అంటూ వ్యాఖ్యానించారు. ఇది కరోనా  వైరసా  లేదా... ఖమ్మ వైరస్సా  అంటూ ఎద్దేవా చేశారు స్పీకర్ తమ్మినేని. అయితే ఈ విషయంలో వెంటనే రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకొని రాజ్యాంగ వ్యవస్థను కాపాడాలి అంటూ స్పీకర్ తమ్మినేని ఈ సందర్భంగా కోరారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ విషయంలోనైనా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటం వెనుక ఎంతోమంది కుట్ర ఉందంటూ ఆరోపించారు స్పీకర్ తమ్మినేని.

మరింత సమాచారం తెలుసుకోండి: