అమ్మ అనేది అమృతమైన పదం. అమ్మతో ఉంటే నిజంగా క్షణాల్లో  బాధలు మాయమైపోతాయి. అమ్మ పక్కన ఉంటే భయం తెలియక క్షణం బరువవ్వ కుండా ఎంతో హాయిగా, మధురంగా ఉంటుంది. అమ్మతో సమస్య చెప్తే చిటికెలో పరిష్కారం లభిస్తుంది. నిజంగా అమ్మ ఒక ఫ్రెండ్ గా సాయం చేస్తుంది.

 

చిన్నప్పటి నుండి ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటూ కంటికి రెప్పలా కాపాడుతూ వస్తుంది. బాధ నీదైతే కన్నీరు తనది, గెలుపు నీదైతే ఆనందం తనది, సమస్య నీదైతే చింత తనది. ఇలా అనుక్షణం ప్రేమ చూపిస్తుంది అమ్మ. అమ్మ ప్రతి ఒక్కరి మొదటి గురువు. అమ్మ లేనిదే మంచి రాదు. అమ్మ లేనిదే బ్రతుకు లేదు.

 

 

నవమాసాలు మోసి బరువు, భారం అనుకోకుండా ఆనందంతో, ఉత్సాహంతో కంటికి రెప్పలా పెంచుతూ వస్తుంది. లాలీ లాలీ అంటూ లాలీ పాట పడుతూ ఆ ఉయ్యాలకి రాజుల పెంచుతుంది. ఇలా అడుగడుగుల్లో, అణువణువులో అమ్మ ప్రేమ అద్భుతం. అమ్మ ప్రేమకి సాటిలేదు.  

 

అమ్మకి బహుమతులు వేలకి  వేలు పెట్టి కొనివ్వడం కంటే ఆనందంగా ఉంటూ మంచిగా జీవితాన్ని సాగిస్తే ఆమెకి చాలు. ఆ కాస్త చిరునవ్వే అమ్మకి బహుమతి. బిడ్డ ఆకలి  కోసం పస్తులుండే  అమ్మలు  ఎందరో ఉన్నారు. ఆశలు వదిలేసుకొని కలల్ని ఆపేసుకుని అహర్నిశలు బిడ్డ జీవితం కోసమే తపిస్తూ వారికి వెలుగుని పంచే తల్లులు మరెందరో.

 

 

అమ్మ బిడ్డ దారి తప్పకుండా మంచి, చెడు, ధర్మం, అధర్మం, నీటి, న్యాయం, నిజాయతి, మంచితనం ఇటువంటి వాటిని ఎంతో సహనంగా నేర్పిస్తుంది. ఇలా ప్రతి దానిలో కూడా అమ్మ చెయ్యి పట్టుకుని నడిపిస్తుంది. 

 

పెంచి పెద్ద చేసి, బంగారు జీవితం అందించిన అమ్మకి గ్రుక్కెడు నీళ్లు కూడా పోయని మహానుభావులు ఉన్నారు ఈ సమాజంలో, అమ్మ నేర్పినవి, చెప్పినవి మరచిపోకూడదు. ఆ నాడు తప్పులు దిద్దుతూ సరిచేస్తూ వచ్చింది.ఈనాడు అమ్మకి అమ్మాయి ఋణం తీర్చుకోవాలి అంతే కానీ వీధిన పడేసి బ్రతుకుని రోడ్డు ఎక్కించడం  మంచి లక్షణం కాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: