ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు భారత్ లో ప్రవేశించి జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. కరోనా ఎఫెక్ట్ ఇప్పుడు అన్నింటిపై పడుతుంది.. సామాన్య మానవులే కాదు.. దేవుళ్లపై కూాడా కరోనా ఎఫెక్ట్ చూపిస్తుంది.  తాజాగా  ప్రసిద్ధ ఆలయాలన్నీ భక్తులను రావొద్దని కోరుతున్న విషయం తెలిసిందే. ఒకవేళ వచ్చినా తగు జాగ్రత్తలు పాటించాలి.. కరోనా వైరస్ ఆనవాళ్లు అసలు ఇటువైపే రావొద్దని ఆంక్షలు విధించే పరిస్థితి వచ్చింది. జాతీయ విపత్తుగా కరోనాను ప్రకటించిన తరువాత రద్దీగా ఉండే ప్రాంతాలలో ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు.  జన సమూహం ఎక్కువగా ఉండొద్దని, జలుబు, దగ్గు, జ్వరం వంటివి ఉంటె వెంటనే హాస్పిటల్ కు వెళ్లి చూపించుకోవాలని, విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు రెండు మూడు వారాలపాటు ఆలయాలకు రాకుండా ఉంటేనే బాగుంటుందని టిటిడి, శ్రీశైలం దేవస్థానాలు పేర్కొన్నాయి.   

 

తాజాగా అన్నవరం సత్యదేవుని దేవస్థానం కూడా కీలక సూచనలు చేసింది.  కరోనా ఎఫెక్ట్ చిన్న పిల్లలకు, వృద్దులకు ఎక్కువగా ఉంటున్న విషయం తెలిసిందే. సత్యన్నారాయణ వ్రతం చేయించుకోవడానికి వచ్చే వ్యక్తులు 12 సంవత్సరాల లోపున్న, 60 సంవత్సరాలు దాటిన వ్యక్తులను తమ వెంట తీసుకురావొద్దని పేర్కొంది.  అదే విధంగా విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు 20 రోజుల తరువాత మాత్రమే ఆలయాని రావాలని ప్రకటించింది.  విదేశాల నుంచి స్వామి దర్శనానికి వచ్చే భక్తులు తమ ప్రయాణాన్ని మూడు వారాల పాటు వాయిదా వేసుకోవాలని సూచించారు.

 

కరోనా వైరస్ ఎఫెక్ట్ ఉండటంతో ప్రత్యేక చర్యల్లో భాగంగానే ముందు జాగ్రత్త చర్యగా సూచనలు చేశామని.. భక్తులు గమనించాలని ఆలయ ఈవో కోరారు. టైమ్ స్లాట్ ప్రకారం ఆ భక్తులు దర్శనానికి డైరెక్టుగా వెళ్లిపోవచ్చు. క్యూలైన్‌లో చేరగానే... రెండు లేదా మూడు గంటల్లోపే దర్శనం అయిపోయేలా చేస్తున్నారు ఆలయ నిర్వాహకులు. ఏది ఏమైాన ఇప్పుడు కరోనా ప్రభావం మనుషులకే కాదు ఆ దేవుళ్లకు తప్పడం లేదని మనమెంత అని అనుకుంటున్నారు జనాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: