ప్రస్తుతం ప్రపంచంలో కరోనా ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇది ఇలా ఉండగా ఇదే క్రమంలో బంగారం ధరలు అల అలా  పరుగులు పెడుతుంది. దీనికి కారణం ముఖ్యం చెప్పుకొంది అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను తగ్గించడం. దీనితో పసిడి ధరలు ఆకాశమే హద్దుగా ఒకేసారి పెరిగాయి. అమెరికన్‌ ఫెడరల్‌ వడ్డీ రేట్లలో కోత విధించడంతో పసిడి ధరలు మరోసారి సునామీలా పెరుగుదలకు దారితీశాయి.

IHG

 


అటు అంతర్జాతీయగా బంగారం ధరలు మరోసారి తారాస్థాయికి చేరాయి. దీనితో దేశీయంగా పదిగ్రాముల బంగారం ధర ముంబైలో 42 వేలకు పైగా ట్రేడ్ అయ్యింది. అలాగే దేశంలోని వివిధ నగరాలైన హైదరాబాద్, చెన్నై, విజయవాడ, వైజాగ్ లలో కూడా బంగారం ధరలు రూ.42 వేలకు పైగానే పలికాయి. పది గ్రాముల బంగారంపై ఏకంగా రూ.1800 పెరుగుదల నమోదైంది. 

 

IHG

ఇంకో వైపు ఎంసీఎక్స్‌ లో సోమవారం ఉదయం పది గ్రాముల బంగారం ఏకంగా రూ. 700 పెరిగి రూ 41,068కి చేరుకుంది. ఇంకా డాలర్‌ తో రూపాయి మారకం విలువ తగ్గడం కూడా బంగారం మరింత పెరగడానికి ఒక కారణం. అలాగే బంగారంతో పాటు వెండి ధరలు కూడా అంతర్జాతీయ మార్కెట్లలోనూ సైతం బంగారం బాటలోనే భారమయ్యాయి. ఎంసీఎక్స్‌ లో కిలో వెండి రూ 338 పెరిగి రూ 40,825 వద్ద ముగిసింది. నిజానికి ప్రపంచంలోని కరోనా ప్రభావంతో రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత భారమవుతాయని మార్కెట్  నిపుణులు అంచనా వేసి చెబుతున్నారు. ఇంకా వేచి చూడాలి ఈ కరోనా మార్కెట్ ని ఎంత వరకు దెబ్బ తీస్తుందో. కరోనా దెబ్బకి ప్రపంచంలోని అన్ని దేశ మార్కెట్లు పేక మేడలా కూలిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: