ఆసియా ఖండంలోనే తొలిసారిగా ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ పద్దతి ద్వారా ఒక యువతికి అతికించిన వేరే యువకుడి రెండు చేతుల రంగు ప్రస్తుతం అనగా మూడేళ్ల తర్వాత ఆమె చర్మం రంగులోకి పూర్తిగా మారింది. శ్రేయా సిద్ధన గౌడ చేతుల చర్మపు రంగు పూర్తిగా ఆమె శరీరం రంగుకి మాదిరిగా మారిందని డాక్టర్లు ఆ విషయాన్ని మీడియా ముఖంగా తెలిపారు. కాకపోతే ఇందుకు గాను శాస్త్రీయ కారణాలు వివరించడం కష్టమని డాక్టర్లు పేర్కొన్నారు. 

 

 


కేరళ రాష్ట్రము కొచ్చిలోని అమృత ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ లో 2017 సంవత్సరంలో దాదాపు 13 గంటల పాటు శ్రమించి బ్రెయిన్‌ డెడ్‌ జరిగిన ఒక యువకుడి చేతులను శ్రేయకు డాక్టర్లు అతికించారు. అయితే ఇప్పుడు అతడి చేతుల బరువు తగ్గి శ్రేయ సొంత చేతుల మాదిరిగానే పూర్తిగా మారిపోయాయి. ఆ ఒక్క విషయమే కాదు, చేతులపై వెంట్రుకలు కూడా చాలావరకు రావట్లేదట. ఒక బైక్‌ యాక్సిడెంట్‌ లో తలకి బలమైన గాయాలు తగలడంతో సచిన్‌ అనే 20 ఏళ్ల వ్యక్తికి బ్రెయిన్‌ డెడ్‌ అయింది. 

 

 


దింతో అతడి చేతులను దానం చేసేందుకు సచిన్‌ తల్లిదండ్రులు ముందుకు రావడంతో అమృతా ఆస్పత్రి తల, మెడ సర్జరీ విభాగం హెడ్‌ డాక్టర్‌ కె.సుబ్రమణియ అయ్యర్‌ ఆధ్వర్యంలో దాదాపు 20 మంది సర్జన్లు సహా 36 మందితో కూడిన పెద్ద డాక్టర్ల బృందం శ్రేయకు చేతులను ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేశారు. దింతో ఆమె చేతుల రంగు మారేందుకు స్త్రీ హార్మోన్లు ప్రభావితం చేసి ఉండకపోవచ్చని డాక్టర్లు ఆలోచిస్తున్నారు.

 

 

 

ముఖ్యంగా చర్మం రంగు విషయంలో మాత్రం స్త్రీ హార్మోన్లు ఎలాంటి ప్రభావం చూపవని అవి కేవలం మెలనిన్‌ మాత్రమే ఆ పని చేస్తుంది అని డాక్టర్లు చెబుతున్నారు. అంతేకాక  చేతులపై ఉన్న వెంట్రుకలు క్రమంగా తగ్గిపోవడానికి కారణం టెస్టోస్టిరాన్‌ హోర్మన్‌ లేకపోవడమేనని ఢిల్లీకి చెందిన ప్రముఖ డెర్మటాలిస్ట్‌ షెహ్లా అగర్వాల్‌ తెలిపారు. చేతులు దానం చేసిన వ్యక్తి శ్రేయ కం‍టే ఎక్కువ సమయం ఎండలో ఉండడం వల్లే అతడి చేతులు ముదురు రంగులోకి మారాయని ఆయన తెలిపారు. వాటిని శ్రేయకు అతికించిన తర్వాత అతడి చేతులు ఇప్పుడు లేత వర్ణంలోకి మారాయని అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా ఇటువంటివి జరిగినప్పుడు అభిందించాలో, లేక కరోనా వంటి వాటిని అరికట్టుకోలేక పోతున్నదుకు వారిని నిదించాలో అసలు అర్థం కావడం లేదు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: