భారతదేశంలోని మార్కెట్ మళ్లీ నష్టాల పాలు అయింది. దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం మరోసారి భారీగా కుప్పకూలింది. ఊహించని విధంగా బెంచ్‌ మార్క్ సూచీలన్నీ  పతనమయ్యాయి. దీనికి కారణం కరోనా వైరస్. దీని దెబ్బకి ఇన్వెస్టర్లందరూ భయపడుతున్నారు. దీనితో గ్లోబల్ మార్కెట్లో అమ్మకాల సునామీ చేరింది. ఈ దెబ్బతో మన దేశ  మార్కెట్‌పై కూడా వాటి ప్రభావం పడింది. ఇదేకాకుండా అమెరికా ఫెడరల్ రిజర్వు ఫెడ్ రేటును తగ్గించడం కూడా ఫలితం లేకుండా పోయింది. అలాగే ఇంట్రాడేలో సెన్సెక్స్ ఏకంగా 2,827 పాయింట్ల నష్టపోయి 31,276 పాయింట్లకు చేరింది. 

 


అలాగే నిఫ్టీ కూడా 790 నష్టపోయి 9,165 పాయింట్లకు చేరింది. మార్కెట్ల సమయం ముగిసే సరికి సెన్సెక్స్ 2,713 పాయింట్ల నష్టంతో 31,390 వద్ద, నిఫ్టీ 758 పాయింట్ల నష్టంతో 9,197 వద్ద ముగిసాయి. ఈరోజు నిఫ్టీ 50 లో ఒక్క యస్ బ్యాంక్ షేరు మాత్రమే లాభపడింది. అది కూడా ఒక్కసారిగా 45% లాభపడింది. అదేసమయంలో ఇండస్ఇండ్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, వేదాంత, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు నష్టపోయాయి. ఇందులో ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు ఏకంగా 18% నష్టపోయింది.

 

 

అలాగే దేశంలోని నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ముగిసాయి. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లు నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లు ఏకంగా  8% నష్టపోయాయి. ఇక అమెరికా డాలర్‌ తో పోలిస్తే భారత రూపాయి విలువ నష్టపోయింది. మొత్తానికి 36 పైసలు నష్టంతో 74.27 వద్ద ట్రేడ్ అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌ లో  ముడి చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌ కు 10 % తగ్గుదలతో 30.34 డాలర్లకు చేరింది. అదేవిధంగా డబ్ల్యూటీఐ క్రూడ్ ధర కూడా బ్యారెల్‌ కు 8 % శాతం క్షీణతతో 29.55 డాలర్లకు వచ్చి చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: