మరో నాలుగు రోజుల్లో నిర్భయ దోషులను తీహార్ జైలులో ఉరి తీయనున్న విషయం తెలిసిందే. దోషులు ఉరి నుండి తప్పించుకోవాలని చేస్తున్న ప్రయత్నాలకు కోర్టు నుండి ఎదురు దెబ్బ తగులుతోంది. ఉరి నుండి తప్పించుకోవటానికి న్యాయస్థానాల్లో అన్ని అవకాశాలు ముగిసిపోవడంతో దోషులు అంతర్జాతీయ న్యాయస్థానంతో పాటు ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించారు. 
 
తాజాగా సుప్రీం కోర్టు దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. నిర్భయ తల్లి ఆశాదేవి సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. దోషులకు ఉరిశిక్ష అమలు చేసే నిర్భయ దోషుల న్యాయవాది ఏదో ఒక పిటిషన్ వేస్తూనే ఉంటాడని అన్నారు. మరోవైపు నిర్భయ దోషుల తల్లిదండ్రులు రాష్ట్రపతికి లేఖ రాశారు. తమను మెర్సీ కిల్లింగ్ కు అనుమతివ్వాలని లేఖలో కోరారు. 
 
పెద్ద పెద్ద తప్పులు చేసిన వారిని కూడా శిక్షించకుండా క్షమించారని రాష్టపతికి క్షమాభిక్ష పెట్టడంలోను అధికారం ఉందని దోషుల తల్లిదండ్రులు వ్యాఖ్యలు చేశారు. తీహార్ జైలు అధికారులు మార్చి 20న ఉదయం 5.30 గంటలకు దోషులను ఉరి తీయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉరి తీయడానికి నాలుగు రోజుల ముందే తలారి జైలుకు రావాలని జైలు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 
 
ఈరోజు తీహార్ జైలుకు తలారి రానున్నారు. మరోవైపు న్యాయపరమైన అవకాశాలు నలుగురు దోషులకు ఇప్పటికే ముగిసిపోయినప్పటికీ దోషులు తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. న్యాయ నిపుణులు ఉరి వాయిదా పడే అవకాశం లేదని చెబుతున్నారు. ఉరి అమలు దగ్గర పడుతుండడంతో మరోసారి శిక్షను వాయిదా వేసేందుకు దోషులు ప్రయత్నాలు చేస్తున్నా కోర్టు నుండి వారికి చెక్కెదురైంది. దోషులు అంతర్జాతీయ న్యాయస్థానంలో వేసిన పిటిషన్ పట్ల కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చేయాలి.                  

మరింత సమాచారం తెలుసుకోండి: