ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ వైరస్ వల్ల ఇప్పటికే 5,833 మంది మరణించగా 1,56,000 మంది కరోనా బాధితులుగా ఉన్నారు. మన దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 107గా ఉంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కొందరిలో కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ బయటకు చెప్పుకోవటానికి, చికిత్స తీసుకోవడానికి ఇష్టపడకపోవడంతో శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 
 
మార్చి 11వ తేదీన శ్రీలంక దేశంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఇటలీ దేశం నుంచి వచ్చిన పర్యాటకులను సందర్శించిన 52 ఏళ్ల టూరిస్ట్ గైడ్ కు కరోనా సోకినట్లు ఆ దేశం ప్రకటన చేసింది. ఇప్పటివరకూ శ్రీలంకలో 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో కరోనాను కట్టడి చేయాలని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. 
 
శ్రీలంక ప్రభుత్వం ఎవరికైనా కరోనా లక్షణాలు ఉండి వాటిని దాచినట్లు తెలిస్తే వారికి 6 నెలల జైలు శిక్ష విధిస్తామని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒక సీనియర్ పోలీస్ అధికారి మీడియాతో మాట్లాడుతూ వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే వ్యక్తులను క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నామని కొందరు వ్యక్తులు మాత్రం సెంటర్లకు రావడానికి నిరాకరిస్తున్నారని అన్నారు. 
 
అలాంటి వ్యక్తులను తాము అరెస్ట్ చేస్తున్నామని... వైరస్ సోకిన వ్యక్తుల పెద్ద అపాయం జరిగే అవకాశాలు ఉన్నాయని అందుకే విదేశాల నుండి వచ్చే వ్యక్తులు సెంటర్లకు వెళ్లడానికి నిరాకరిస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యామని తెలిపారు. కేరళ ప్రభుత్వం ప్రతి పోలీస్ స్టేషన్ లో ఏడుగురు పోలీస్ అధికారులను నియమించి, క్వారంటైన్ నిబంధనల గురించి ప్రజలకు సమాచారం ఇస్తారని అన్నారు.                      

మరింత సమాచారం తెలుసుకోండి: