దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉన్న విషయం తెలిసిందే. కరోనా కేసుల సంఖ్య 107కు చేరింది. ఈ సంఖ్య మరింతగా పెరుగుతూ ఉన్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు బయట తిరిగితే కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. 
 
రాష్ట్ర వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని సూచించారు. 13 జిల్లాల కలెక్టర్లకు ఇతర దేశాల నుంచి వచ్చే వారికి 14 రోజుల పాటు వారి ఇంట్లో నుండి బయటకు రాకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొందరు బయట తిరుగుతున్నట్లు సమాచారం అందిందని అన్నారు. 
 
ఎవరైనా బయట తిరిగితే అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఇప్పటికే అన్ని ఆదేశాలను జారీ చేశామని అన్నారు. రాష్ట్రానికి విదేశాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరినీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతామని చెప్పారు. మాస్కులు, శానిటైజర్లను అధిక ధరలకు విక్రయిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. 
 
మాస్కులు, శానిటైజర్లను కొన్న ధర కంటే పది శాతం ఎక్కువ ధరకు విక్రయించాలని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని మెడికల్ షాపులలో ధరలను డిస్ ప్లే చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి, విజయవాడలలో కరోనా నిర్ధారణ ల్యాబ్ లను ఏర్పాటు చేశామని అన్నారు. కాకినాడలో కరోనా బాధితుల కోసం మరో ల్యాబ్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ నెల్లూరులో మాత్రమే కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణ అయింది. కరోనా అనుమానిత లక్షణాలతో కొందరు ఆస్పత్రుల్లో జాయిన్ అవుతున్నప్పటికీ వారెవరికీ కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: