కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఈ పేరు చెప్తేనే వెన్నులో వణుకొస్తోంది. అయితే.. నేపథ్యంలో ప్రపంచమంతా హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. చైనాలోని వుహాన్ లో పుట్టిన ఈ వైరస్ అక్కడ తగ్గుముఖం పట్టి కేసుల సంఖ్య తగ్గినా ఇతర దేశాల్లో మాత్రం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. కాగా., ఈ వైరస్ వ్యాధి లక్షణాలు ఉన్న వారిని నిర్బంధించి మరీ చికిత్స అందించేలా కొత్త నిబంధనలను తీసుకొస్తున్నారు. ప్రస్తుతం కరోనా యూకేను గజగజ లాడిస్తోంది. అక్కడ ఆదివారం నాటికి సుమారు 35 మంది మరణించారని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో యూకే హెల్త్ సెక్రటరీ మ్యాట్ హ్యాంకాక్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ కీలక నిర్ణయాల్లో 70 ఏళ్ల వయస్సు పైబడిన వారు ఇంటి బయటికి రావొద్దని, అలాగే.. ఈ వైరస్ లక్షణాలతో బాధపడుతున్న వారిని నిర్బంధించి చికిత్స విధించాలని ఆదేశాలను జారీ చేసింది.


యూకే ప్రభుత్వం కరోనాను అదుపు చేయడానికి హెల్త్ ప్రొటెక్షన్ ను అందుబాటులోకి తెచ్చింది. అంటే ఏమిటంటే.. ఎవరైనా ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతుంటే వారిని వెంటనే వారికి కేటాయించిన ఇసోలాటిన్ వార్డులలో ఉంచాలని, ఎవరైనా పారిపోవాలని ప్రయత్నిస్తే వారికి సుమారు రూ.91 వేల పౌండ్లు జరిమానా లేదా జైలు శిక్ష తప్పదని యూకే ప్రభుత్వం ప్రకటించింది. అలాగే.. కుటుంబంలో ఎవరికైనా కరోనా వైరస్ ఉందని తెలిస్తే.. వారితో పాటు వారి కుటుంబ సభ్యులందరిని ఐసోలేషన్‌ లో ఉంచాలని యూకే ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం యూకేలో 1,372 మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. కాగా., గడిచిన 24 గంటల్లో 14 మంది చనిపోయినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇక్కడిలాగే యూకే ప్రభుత్వం కూడా కరోనా విస్తరించొద్దనే యూకేలోని సినిమా హాళ్లను మూసివేశారు. 


కరోనా వైరస్‌ కు శాస్త్రవేత్తలు ఓ వ్యాక్సిన్‌ ను సిద్ధం చేశారట అయితే.. ఆ వ్యాక్సిన్‌ ను ఇప్పటివరకు జంతువులపైన మాత్రమే ప్రయోగించారట.. అయితే ఇప్పుడు దీన్ని కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న మనుషులపై సోమవారం ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించాలని యూకే ప్రభుత్వం భావిస్తోందట. వాక్సిన్ కు సంబంధించిన పరిశోధనలు సియాటెల్‌ లోని కైసేర్ పెరామనెంట్ వాషింగ్టన్‌ హెల్త్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ లో జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ వాక్సిన్ ను ముందుగా 45 మంది యువకులపై ప్రయోగిస్తామని పేర్కొన్నారు. ఈ వాక్సిన్ వల్ల కరోనా బాధితులకు ఎలాంటి ప్రమాదం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: