ఏపీలో అధికార వైసీపీ లో అతి తక్కువ టైమ్ లోనే సూపర్ గా పాపులర్ అయిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి..  అంతే తక్కువ టైంలో అన్ పాపుల‌ర్‌ అయిపోయారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం వైసిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో కష్టపడి తనవంతుగా జగన్ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసిన పృథ్విరాజ్ అప్పటి సీఎం చంద్రబాబును టార్గెట్ గా చేసుకుని పేల్చిన పంచ్ డైలాగులు బాగా హైలైట్ అయ్యాయి. ఇక జగన్ సైతం పృథ్విరాజ్ పడిన కష్టం గుర్తించి తాను సీఎం అయిన వెంటనే ప్రతిష్ఠాత్మకమైన ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ గా నియమించారు.

 

అయితే పృథ్విపై ఈ ప‌ద‌విలో అనేక ఆరోప‌ణ‌లు రావడంతో ఆయ‌న్ను ఆరు నెల‌ల‌కే ఈ ప‌ద‌వి నుంచి త‌ప్పిచేశారు. ఇక త‌నను ఈ ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌డం వెన‌క కొంద‌రి కుట్ర ఉందంటూ పృథ్వి వాపోతూ ఉన్నారు. ఇక పోసాని ముందుగా పృథ్విని టార్గెట్ చేయ‌డంతో అక్క‌డ నుంచి మొద‌లైన వేడి చివ‌ర‌కు పృథ్వి ప‌ద‌వి పోయే వ‌ర‌కు వెళ్లింది. ఇక తాజాగా ఓ మీడియా ఛానెల్ ఇంట‌ర్వ్యూలో పృథ్వి మాట్లాడుతూ మ‌ళ్లీ తాను ప‌ద‌విలోకి వ‌స్తాన‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే త‌న‌కు ఎంపీ ప‌ద‌వి చేప‌ట్టాల‌న్న కోరిక ఉంద‌ని పృథ్వి చెప్పారు.

 

త‌న జీవిత ఆశ‌యం ఎంపీ అవ్వ‌డం అని.. ఎప్ప‌ట‌కి అయినా తాను ఎంపీ అవుతాన‌న్న కోరిక త‌న‌కు ఉంద‌ని పృథ్వి చెప్పారు. ఇక పృథ్వి సొంత ఊరు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని తాడేప‌ల్లి గూడెం. ఇది న‌ర‌సాపురం లోక్‌సభ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉంది. ఇక పృథ్వి కోరిక నెర‌వేరాలంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ న‌ర‌సాపురం సీటు ఆయ‌న‌కు ఇవ్వాలి. మ‌రి పృథ్వి కోరిక‌ను జ‌గ‌న్ ఎప్ప‌ట‌కి అయినా నెర‌వేరుస్తారా ?  లేదా ఎస్వీబీసీతోనే పృథ్వి కెరీర్ అయిపోయింద‌నుకోవాలా ? అన్నది కాల‌మే నిర్ణ‌యించాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: