ప్రపంచం మొత్తమ్మీద దాదాపు 90 శాతం భూభాగంపై కరోనా మహమ్మారి పంజా విసిరింది. చైనా, అమెరికా, ఇటలీ, ఇరాన్, స్పెయిన్ సహా అనేక దేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి భారత్ పై పంజా విసిరింది.  ఇప్పటికే కరోనా కేసుుల 80 దాటిపోయాయి.. ఇద్దరు మృతిచెందారు.  అయితే కరోనా ఎఫెక్ట్  చైనాలో మొదలైన ఈ వైరస్ అక్కడ కాస్త అదుపులోకి వచ్చినా యూరప్ దేశాలకు బాగా విస్తరించి భయపెడుతోందని సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి ప్రకటించడం గమనార్హం. 

 

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 1,45,631 మందికి చేరింది. ముఖ్యంగా ఇటలీలో పరిస్థితి తీవ్రంగా ఉంది. తాజాగా కరోనా వైరస్ గురించి టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రోనా మహమ్మారి పంజా విసిరితే ఏమీ చేయలేరని, ఇలాంటి పరిస్థితుల్లో నియంత్రణ చర్యలు తీసుకోకుండా ఎన్నికల కోసం పాకులాడుతున్నారని మండిపడ్డారు. 

 

అయితే కరోనా కు మందులు రాలేదు.. మనం జాగ్రత్తలు తీసుకుంటేనే అరికట్టగలం అని ఆయన అన్నారు.  ఇప్పటికే కరోనాపై అవగాహన ఏర్పాటు చేస్తున్నారని.. ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు.. వేటి వల్ల కరోనా వైరస్ వస్తున్న విషయం గురించి తెలుసుకుంటే చాలా మంచిది అని అన్నారు.  కరోనా వ్యాప్తి చెందే ఓ ఇరవై అంశాల గురించి ఆయన ప్రస్తావించారు. 

- పాల ప్యాకెట్లు
- కారు డోర్లు
-ఇంట్లో పనిమనుషులు
- పచ్చి కూరగాయలు, పండ్లు
-షాపు కౌంటర్లు
-గార్డెన్ సీట్లు
-పనిమనుషులు ఇంట్లో తాకే ప్రదేశాలు
-ఇంట్లోని డోర్ నాబ్ లు
-షాపుల్లోని ప్యాకెట్లు
-కరెన్సీ నోట్లు, నాణేలు
-ఊబెర్ క్యాబ్, ఆటోలు
-బస్, ట్రెయిన్ హ్యాండిళ్లు
-ఆట స్థలాలు
-లిఫ్టు బటన్లు
-డోర్ బెల్స్
-న్యూస్ పేపర్
-బూట్లు
- జుత్తు

- ఆఫీసు లంచ్ రూమ్, వాష్ రూమ్, బాత్రూమ్ డోర్ హ్యాండిల్స్
-అమెజాన్ తదితర డెలివరీ బాయ్స్ అందించే ప్యాకెట్లు

మరింత సమాచారం తెలుసుకోండి: