జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విశాఖపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అభివృద్ధిలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేసి, విశాఖని పాలన రాజధానిగా నిర్ణయించారు. అలాగే ఈ మూడు రాజధానులతో పాటు, విశాఖ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ చేసుకుంటూ ముందుకెళుతున్నారు.  అయితే ఈ విధంగా చేయడం వల్ల విశాఖలో వైసీపీకి ఫుల్ మైలేజ్ వచ్చింది. ఫలితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకునే అవకాశముంది.

 

కాకపోతే కీలకమైన విశాఖ గ్రేటర్ కార్పొరేషన్‌లో గెలుపుపై మాత్రం కాస్త అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ టీడీపీకి గట్టి పట్టుంది. మొన్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ జిల్లా మొత్తం ఓడిపోయిన, నగరంలో ఉన్న నాలుగు సీట్లని మాత్రం గెలుచుకుంది. విశాఖ తూర్పులో వెలగపూడి రామకృష్ణ, పశ్చిమంలో గణబాబు, ఉత్తరంలో గంటా శ్రీనివాస్, దక్షిణంలో వాసుపల్లి గణేశ్ కుమార్‌లు గెలిచారు. అయితే మూడు రాజధానుల నిర్ణయం వచ్చాక, విశాఖలో టీడీపీ కాస్త వీక్ అయింది. అలాగే నగరంలో కూడా పెద్దగా అనుకూల వాతావరణం లేదు.

 

కాకపోతే టీడీపీని తక్కువ అంచనా వేయడానికి లేదు. కాబట్టి విశాఖ మేయర్ పీఠాన్ని ఏ మాత్రం అనుమానం లేకుండా సొంతం చేసుకోవాలంటే, ఈ నలుగురు ఎమ్మెల్యేల్లో కనీసం ఇద్దరు ఎమ్మెల్యేలు సపోర్ట్ ఉంటే వైసీపీ విజయం సులువు అవుతుంది. అందుకనే ఈ నలుగురు ఎమ్మెల్యేలని లైన్‌లో పెట్టే బాధ్యత ఎంపీ విజయసాయిరెడ్డి తీసుకున్నారు.

 

ఈ క్రమంలోనే ఆయన లాబీయింగ్ కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ నలుగురిలో వెలగపూడి టీడీపీని వీడటం కష్టం. దీంతో మిగిలిన ముగ్గురుపై ఫోకస్ చేసి, కనీసం ఇద్దరి మద్ధతు అయిన దక్కించుకోవాలని విజయసాయి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే గంటా శ్రీనివాస్, వాసుపల్లి గణేశ్‌లు లైన్ అయ్యేట్లు ఉన్నారని తెలిసింది. గ్రేటర్ విశాఖ ఎన్నికల్లోపే వీరు జగన్‌కు జై కొట్టే అవకాశముందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: