మామూలుగా తెరవెనుక నుండి ఎవరు ఎటువంటి వ్యూహాలు పన్నినా ఆ విషయం బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకవేళ బయటపడినా పుణ్యకాలం గడచిపోయిన తర్వాత  ఎప్పుడో బయటపుడుతోంది.  అలాంటిది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడు వ్యూహాలు మాత్రం ఇంత తొందరగా బయటపడిపోతున్నాయే ?  చంద్రబాబు ప్లాన్లన్నీ అవుట్ డేటెడ్ అయిపోయాయా ?  ఇపుడిదే అంశంపై చర్చ జరుగుతోంది.

 

నిజానికి చంద్రబాబుకు సొంత బలం ఏనాడూ లేదనే చెప్పాలి. ప్రత్యర్ధి బలహీనతే తన బలంగా మార్చుకుంటాడు. సరే ఇది కూడా పచ్చమీడియా మద్దతుంది కాబట్టి చెల్లుబాటైపోతోంది లేండి.  సరైన ప్రత్యర్ధులు లేనపుడు చంద్రబాబు ఏమి చేసినా చెల్లుబాటైపోయింది. కానీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ వ్యూహాలేవి ఇపుడు పనిచేయటం లేదు. పైగా తెర వెనుక నుండి వేసిన ప్లాన్లన్నీ వెంటనే బయటపడిపోతున్నాయి.

 

ఇందుకు రెండు ఉదాహరణలు ఉన్నాయి. మొదటిది రెండు బిల్లులను సెలక్ట్ కమిటికి పంపుతు శాసనమండలిలో  ఛైర్మన్ ఎంఏ షరీఫ్ చేసిన ప్రకటన. ఛైర్మన్ చేసిన ప్రకటన నిబంధనలకు విరుద్ధమని అందరికీ తెలుసు. తాను చేస్తున్న ప్రకటన నిబంధనలకు విరుద్ధమని అసలు ఛైర్మన్ కే తెలుసు. అయినా ఎందుకు చేశాడు ? ఎందుకంటే తెరవెనుక చంద్రబాబు చేసిన కుట్రగా అదే రోజు బయటపడిపోయింది.

 

శాసనమండలి సమావేశాలు జరుగుతున్నపుడు దాదాపు నాలుగు గంటలు మండలి గ్యాలరీలోకి చంద్రబాబు వచ్చి కూర్చోగానే విషయం బయటపడిపోయింది. ఛైర్మన్ కు నేరుగా కూర్చుని ప్రభావితం చేసి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించమని ఒత్తిడి పెట్టాడని. ఇక తాజాగా స్ధానిక సంస్ధల ఎన్నికలను వాయిదా వేసినట్లు ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన ప్రకటన వెనుక కూడా చంద్రబాబే ఉన్నట్లు తేలిపోయింది.

 

ఎన్నికల్లో ఎక్కువగా వైసిపికి అనుకూలంగా ఏకగ్రీవాలవ్వటం, నామమాత్రపు పోటికి కూడా టిడిపి సిద్ధంగా లేకపోవటం, అసలు పోటికే సీనీనియర్ నేతలు చాలామంది ముందుకు రాకపోవటం లాంటి అనేక సమస్యలున్నాయి పార్టీలో. దీన్ని అధిగమించేందుకు చంద్రబాబు కమీషనర్ ను మ్యానేజ్ చేసి ఎన్నికలు వాయిదా వేయించినట్లు స్పష్టమైపోయింది. చంద్రబాబు వ్యూహాలన్నీ ఎందుకింత తొందరగా బయటపడిపోతున్నాయో అర్ధం కావటం లేదు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: