మొన్నటివరకు చైనా దేశంలో మరణ మృదంగం మోగించి ఏకంగా మూడు వేల మందికి పైగా ప్రాణాలను పొట్టన పెట్టుకుంది కరోనా  వైరస్. ఇక ఇప్పుడు చైనా దేశంలో కాస్త తగ్గుముఖం పడుతున్నప్పటికీ ప్రపంచ దేశాలకు మాత్రం శరవేగంగా విస్తరిస్తోంది ఈ మహమ్మారి వైరస్. దీంతో ప్రపంచ దేశాల ప్రజలు కూడా చిగురుటాకులా వణికిపోతున్నారు . అయితే ఈ ప్రాణాంతకమైన వైరస్ కు సరైన వ్యాక్సిన్ కూడా ఇప్పటివరకు శాస్త్రవేత్తలు ఎవరు కనిపెట్టక  పోవడంతో ఈ వైరస్ ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తుంది. ముఖ్యంగా ప్రపంచ దేశాలలో కెల్లా ఇటలీ దేశంలో ఈ ప్రాణాంతకమైన వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. 

 

 చైనా దేశం తర్వాత ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఇటలీ దేశం లోనే ఉంది. ఇటలీలో ఇప్పటికే ఈ వైరస్ బారినపడి ఎంతోమంది ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇటలీ ప్రభుత్వం మరింత భయపడుతుంది. ఎందుకంటే వీరిలో 22 శాతం మేర వృద్దులు వయో  వృద్దులు  ఉన్నారు. దీని కారణంగా అక్కడ తొందరగా వైరస్ వ్యాప్తి జరుగుతుంది. అయితే వైరస్ వ్యాప్తి లో మొదటి దశలో ఇటలీలో చర్యలు సరిగ్గా తీసుకోలేదు. 

 


 అయితే గత రెండు మూడు వారాలుగా ఇటలీలో నిమోనియా కేసులు ఎక్కువగా రాగా.. కరోనా  లక్షణాలు కూడా నిమోనియా లక్షణాలు అనుకొని అక్కడి వైద్యులు ఎలాంటి పరీక్షలు జరపలేదు. ఇక చైనా నుండి వివిధ కారణాలతో వచ్చిన వారికి కరోనా  లక్షణాలు ఉండడంతో అది దేశంలో ఎక్కువగా వ్యాపించింది. దీంతో ప్రస్తుతం రోజురోజుకూ పరిస్థితి చేయి దాటి పోతుంది. ఏకంగా ఒక్క రోజుకి 1000 మంది వరకూ చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటలీ ప్రభుత్వం ఓ విచిత్రమైన నిర్ణయం తీసుకుంది . 80 ఏళ్ల వయసు పైబడినవారు కరోనా  లక్షణాలతో ఉంటే వారికి అసలు ట్రీట్మెంట్ ఇవ్వకూడదు అంటూ నిర్ణయం తీసుకుంది ఇటలీ  సర్కార్. అయితే కరోనా వైరస్ ప్రస్తుతం శరవేగంగా వ్యాప్తిచెందిన నేపథ్యంలో ముఖ్యంగా యువకులకు మాత్రమే చికిత్స అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించగలం...  80 ఏళ్ల పైబడి చావుకు దగ్గరగా ఉన్న వారికి చికిత్స అందించ లేము అంటూ ఇటలీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇటలీ ప్రభుత్వ ప్రకటనతో ప్రపంచ దేశాల మొత్తం దిగ్భ్రాంతికి గురయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: