స్వ‌యం స‌హాయ‌క సంఘాల స‌భ్యుల పెన్ష‌న్  కాంట్రిబ్యూష‌న్ (అభ‌య‌హ‌స్తం) ర‌ద్దు బిల్లుని స‌భ ఏక‌గ్రీవంగా అమోదించాల‌ని కోరుతూ, శాస‌నమండ‌లిలో రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు బిల్లుని ప్ర‌వేశపెట్టి ఆమోదింప చేశారు. అభ‌య‌హ‌స్తం కింద మ‌హిళా స‌భ్యులు  చెల్లించిన మొత్తానికి వ‌డ్డీతో స‌హా వాళ్ళ‌కు చెల్లిస్తామ‌ని తెలిపారు. అలాగే, అభ‌య హ‌స్తంలోని స‌భ్యులు అస‌రా పెన్ష‌న్లు తీసుకుంటున్నార‌ని, మిగ‌తా అర్హులంద‌రికీ ఆస‌రా పెన్ష‌న్లు ఇస్తామ‌ని మంత్రి చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీలు జాఫ్రీ, జీవ‌న్ రెడ్డి త‌దిత‌రులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధాన‌మిచ్చారు.

 

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ, సభ‌కు అభ‌య హ‌స్తం ప‌థ‌కం వివ‌రాల‌ను అందించారు. తెలంగాణ రాష్ట్రంలో....అభయ హస్తంలోని స‌భ్యులు 23 లక్షల 28 వేల 14 మంది ల‌బ్ధిదారులు ఉన్నార‌ని పేర్కొన్నారు. అభయహస్తం ఫించన్ దారుల సంఖ్య‌ 2 లక్షల 20 వేల 12 మంది అని పేర్కొన్నారు. 1 లక్ష 33 వేల 415 ఆస్రా పెన్షన్ మొత్తం 2016 రూపాయలు అయినందున ‘ఆస‌రా’లోకి మళ్లంచి పెన్షన్ ఇవ్వడం జరుగుతోంది. మిగిలిన స‌భ్యుల‌కు ప్ర‌భుత్వం 2017 నుంచి పెన్షన్ మొత్తమున వారికి ప్రభ్యత్వము త‌ర‌ఫున చెల్లించడం జరుగుతుందని వెల్ల‌డించారు. 

 


`అభయహస్తం పథకము కింద స‌భ్యురాల్ల‌కు చెల్లంచాల్సిన‌ మొత్తం వ‌డ్డీతో స‌హా వారి వాటాధ‌నం వారికి చెల్లించడం జరుగుతుంది. అభయహస్తంలో కల అదన‌పు ప్రయోజనాలైన 9,10 త్రగతులు, ITI, ఇంటర్ విద్యార్థులకు ఇచ్చి సంవ‌త్స‌రానికి 1200 రూపాయల స్కాలర్ షిప్, స‌హజ మరణానికి ఇచ్చి మొత్తము 30 వేల రూపాయలు, ప్రమాద మరణానికి ఇచ్చి మొత్తము 75 వేల రూపాయలు నిజానికి అభయహస్తం చట్టంలో లేదు. ‘జన‌శ్రీ భీమా యోజన్’ కేంద్ర ప్రభుత్వ పథకంలో ఉన్న ఈ ప్రయోజనాలను ‘అభయహస్తం’ పథకముతో కల్పి అదనంగా ఇచ్చేవారు. అయితే కేంద్ర ప్రభుత్వం 2017 నండి ‘జ‌న‌శ్రీ బీమా యోజన’ ఉప సంహరించుకున్న త‌ర్వాత‌00 ఈ అదన్పు ప్రయోజనాలైన 9,10 వ త‌ర‌గ‌తి, ITI, ఇంట‌ర్ విద్యార్థులకు ఇచ్చి స్కాలర్ షిప్ ను, స‌భ్యులు స‌హ‌జ మరణం చెందిన్పుడు ఇచ్చి 30 వేల రూపాయలు, ప్ర‌మాద మరణానికి ఇచ్చి 75 వేల రూపాయలన ఆపివేయడం జరిగింది. ఈ ప్రయోజనాలు ఇత‌ర‌ రాష్ట్రాల‌లో కూడా అభయహస్తం, భీమా స‌దుపాయాలు విడివిడిగా ఉన్నాయి.`` అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: