గత కొన్ని నెలల నుండి కరోనా వైరస్ ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలను గజగజా వణికిస్తున్న విషయం తెలిసిందే. మన దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కేంద్ర ఆరోగ్య శాఖ అధికారిక లెక్కల ప్రకారం నిన్నటివరకు 107గా ఉంది. హైదరాబాద్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4కు చేరింది. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు స్కూళ్లు, థియేటర్లను బంద్ చేయాలని ఆదేశించాయి. తాజాగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో కేంద్రం సంచన నిర్ణయం తీసుకుంది. 

 

IHG


 
ఈ నెల 31వ తేదీ వరకు దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలను మూసివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే సదుపాయం కల్పించాలని కంపెనీలను కోరారు. మాల్స్, స్విమ్మింగ్ పూల్స్ వంటి వాటిని కూడా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

 

IHG


 
కేంద్రం ఆదేశాలతో తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో ఈ నెల 31 వరకు థియేటర్లు, కాలేజీలు, స్కూళ్లు, బార్లు, కళ్యాణ మండపాలు, క్లబ్బులు, స్టేడియాలు, జూ, జిమ్స్ మూసివేయాలని ఆదేశించింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తమిళనాడులో జనసందోహం ఎక్కువగా సంచరించే ప్రాంతాలన్నీ మూతపడ్డాయి. 

 

IHG


 
ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ స్కూళ్లు, థియేటర్లు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం రేపు స్కూళ్లు, థియేటర్ల బంద్ గురించి అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రజలు ప్రజారవాణా విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: