జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఎన్నో అరాచకాలకు పాల్పడుతోందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయని కొద్దిరోజులుగా విమర్శలు చేస్తున్న జనసేన పార్టీ ప్రస్తుతం అన్ని పరిణామాల గురించి కేంద్ర బిజెపి పెద్దలను కలిసి సవివరంగా తెలియజేయాలని చూస్తున్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
 
 
IHG
 
కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ లు బంద్ కావడంతో పవన్ కు విరామం లభించింది. దీంతో ఏపీలో పరిణామాలపై ఢిల్లీ పెద్దలను కలిసి రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకోవాలని పవన్ చూస్తున్నారు. మాచర్లలో జనసేన అభ్యర్థి నామినేషన్ వేసేందుకు వెళ్తే వైసీపీ నాయకులు అడ్డుకోవడంతో పవన్ ఆగ్రహంగా ఉన్నారు. అంతే కాకుండా ఏపీలో చాలాచోట్ల బిజెపి జనసేన కార్యకర్తలు నామినేషన్లు వేయకుండా వైసీపీ అడ్డుకోవడంతో పాటు వెంటాడి వేధించిన సంఘటనలకు సంబంధించిన సాక్ష్యాలను కూడా పవన్ ఢిల్లీకి తీసుకు వెళ్లాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది .
 
 
IHG
 
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడంతో మళ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఉన్న సమయాన్ని జనసేన కు అనుకూలంగా మార్చుకుని వైసీపీకి గట్టి షాక్ ఇవ్వాలని పవన్ భావిస్తున్నారు. దీని ద్వారా ఏపీ లో జరుగుతున్న అక్రమాలను అన్యాయాలను పవన్ అడ్డుకుంటున్నారని ప్రజల్లో ఒక రకమైన సానుభూతి వస్తుందని,అలాగే జనసేన నాయకులు కూడా నూతన ఉత్సాహం వస్తుందని పవన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
 
 
 అయితే పవన్ ఢిల్లీకి వెళ్లినా కేంద్ర బిజెపి పెద్దలు ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే ఏపీ లో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర బిజెపి పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు రెండు మూడు సార్లు ఢిల్లీకి వెళ్లిన పవన్ కళ్యాణ్ కు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు కూడా బీజేపీ పెద్దలు ఇష్టపడకపోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. మరోసారి ఢిల్లీకి వెళ్ళబోతున్న పవన్ కు సాదర స్వాగతం లభిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: