అసెంబ్లీ లో ఈ రోజు సీఎం కేసీఆర్ కాస్త అగ్రెసీవ్ గా కనిపించారు.  కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మంచిగా మాట్లాడితే..మంచిగానే సమాధానం ఉంటుందన్నారు. మంచిని మంచి అనే సంస్కారం కాంగ్రెస్ కు లేదని మండిపడ్డారు. ఆంధ్ర వాళ్ళు పరిపాలన చేసుకోవడం చేతకాదని అంటే .. కాగ్ ఆడిట్ జనరల్  తెలంగాణ పాలన బాగుందని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.  రాష్ట్రంలో  నీళ్లు అద్భుతంగా ఉన్నాయి కాబట్టే  రైతులు కాలు మీద కాలు వేసుకొని పంటలు పండించుకుంటున్నారని, ఆ  విషయం కాంగ్రెస్ కు కనిపించడం లేదా అని అన్నారు.

 

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌ చార్జీలు కూడా పెంచుతామని అన్నారు. ఐదేళ్లలో కేంద్రం నుండి 1లక్ష 12వేల కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయని చెప్పారు. 2014 నుండి 2019 వరకు 2లక్షల 72వేల 926 కోట్లు తెలంగాణ నుండి పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్లాయన్నారు. రెండేళ్లలో సంపద పెరిగి అప్పులు తీరుతాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పాలనలో మద్యం షాపులు లేనట్లు మాట్లాడుతున్నారని, గతంలో మద్య నిషేధం అమలు చేస్తే అట్టర్‌ ఫ్లాప్‌ అయిందని గుర్తుచేశారు.  ఐదేళ్లలో కేంద్రం నుండి 1లక్ష 12వేల కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయని చెప్పారు.  అప్పుల చేసిన అమెరికా ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా పేరుగడిస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు.

 

అందుకే తాము అప్పులు తెచ్చిఇరిగేషన్ కోసం కేటాయించామని, రైతులు పంటలు వేసుకుంటే  అప్పులు తీరిపోతాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామాల్లో గుడుంబా బట్టీలు లేకుండా చేశామని.. అవసరమైతే మద్యం ధరలు మళ్లీ పెంచుతామని సీఎం వెల్లడించారు. ఏ ప్రభుత్వం ఉన్నా విద్యుత్‌ చార్జీలు, ఆర్టీసీ బస్ చార్జీలు పెంచుతుందని కేసీఆర్ చెప్పారు.  తెలంగాణ ముందు ముందు ఎలా మారుతుంతో ప్రతిపక్ష నేతలు చూస్తుంటారని.. అభివృద్ది చూసి మన ఇతర రాష్ట్రాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకునే పరిస్థితి వస్తుందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: