ఏపీ అధికార పార్టీలో చేరికల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులంతా వచ్చి వైసీపీలోకి క్యూ కడుతుండడంతో ఆ పార్టీలో సందడి వాతావరణం నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని పెద్ద ఎత్తున వైసీపీలో చేరికలకు జగన్ తెర తీశారు. దీంతో టీడీపీలో ఉన్న అసంతృప్తి వాదులు, రాజకీయ భవిష్యత్తుపై బెంగ ఉన్నవారు ఇలా అంతా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇంకా అనేకమంది చేరుతూనే ఉన్నారు. అయితే ఈ చేరికల సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు వైసీపీలో నాయకులకు కొత్త బెంగ వచ్చి పడింది. ప్రస్తుతం వైసీపీలో చేరుతున్నవారు ఆషామాషీ వ్యక్తులు ఏమీ కాదు నియోజకవర్గాల్లో గట్టి పట్టు ఉన్న బలమైన నేతలు కావడంతో వారి చేరికలతో ఆ నియోజకవర్గ వైసీపీ ఎమ్యెల్యేలు, కీలక నాయకులు తమ హవా ఎక్కడ తగ్గుతుందో, తమ రాజకీయ భవిష్యత్తుకి ఎక్కడ గండి పడుతుందో అన్న ఆందోళనలో ఉన్నారు.

IHG


 టీడీపీ సీనియర్ నేతలు రామసుబ్బారెడ్డి, కదిరి బాబూరావు, రెహమాన్‌ వంటి నేతలు నేతలు వైసీపీలో చేరారు.ఇంకా అనేకమంది చేరేందుకు క్యూలో ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా..ప్రతిపక్ష పార్టీ నేతలు తమ పార్టీలో చేరడం, అప్పటి వరకు వారితో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండడంతో ఇప్పుడు వారితో ఎలా అడ్జస్ట్ అవ్వాలో తెలియక నాయకులు సతమతం అయిపోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. 


వారంతా వైసీపీలో చేరకపోయినా వారికే నియోజకర్గ బాధ్యతలు అప్పగించారు. అయితే, చాలా చోట్ల ఎమ్మెల్యేలకు వైసీపీ ఇన్‌చార్జ్‌లకు మధ్య సయోధ్య అస్సలు కుదరడం లేదని తెలుస్తోంది. మొదట చేరిన వల్లభనేని వంశీ నియోజకవర్గం గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావ్‌కు వంశీకీ మధ్య విబేధాలు ఇంకా సమిసిపోలేదు. ఆ తరువాత గుంటూరు ఈస్ట్‌లోనూ మద్దాల గిరికి, వైసీపి నాయకులకు మధ్య ఇదేరకమైన విబేధాలు ఉన్నాయి. ఇలా అన్ని చోట్ల వైసీపీ నాయకులు చేరికలతో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: