తెలుగుదేశం పార్టీ పుట్టెడు కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఒక పక్క పార్టీ ఉనికిని ఏ విధంగా చాటి చెప్పాలో తెలియక సతమతం అవుతూనే మరోవైపు పార్టీ  నాయకుల వలసలను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. అయినా పెద్దగా పరిస్థితుల్లో మార్పు కనిపించకపోవడంతో నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుతం వయస్సు రీత్యా చూసుకున్నా చంద్రబాబు పరిస్థితి చూస్తే ఆయన వయస్సు ఏడు పదులు దాటుతోంది. క్రమక్రమంగా పార్టీకి దూరం జరగాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే తన తరువాత పార్టీని ముందుకు నడిపించే సమర్థుడైన, బలమైన నాయకుడి కోసం చంద్రబాబు చూస్తున్నా ఎవరూ కనిపించడంలేదు. 

 

IHG


ఒకవేళ కనిపించినా తన రాజకీయ వారసుడు నారా లోకేష్ ను కాదని వేరొకరికి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం అయితే లేదు. లోకేష్ నాయకత్వాన్ని పార్టీలో నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు లోకేష్ కారణంగానే పార్టీకి ఈ పరిస్థితి దాపరించింది అంటూ మండిపడుతున్నారు. లోకేష్ కూడా సోషల్ మీడియాలో ట్విట్లు పెట్టడానికి తప్ప మారేందుకు పనికిరాడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. దీంతో చంద్రబాబు తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియని గందరగోళ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. 

 

IHG


ఇక లోకేష్ కూడా తమకు ముందు నుంచి పట్టు ఉందని చెప్పుకుంటున్నఅమరావతి ప్రాంతంలోని మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి చెందాడు. దీంతో తెలుగుదేశం జనాలు లోకేష్ ను అసమర్దుడిగానే ఇంకా చూస్తున్నారు.  తమ రాజకీయ భవిష్యత్తు బాగుండాలి అంటే వెనకా ముందు ఆలోచించకుండా వైసిపి బాటలో వెళ్లడమే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు. చంద్రబాబు కూడా నిర్ణయాలు తీసుకోవడంలో లోకేష్ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీంతో పార్టీలో ఉంటే కొంప ములుగుతుంది అనే భావనలో వైసీపీ కండువా కప్పేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇక వైసీపీ కూడా టీడీపీలో బలమైన నాయకులను, యువ నాయకులను టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: