ఒక్క సారి అధికారంలోకి వస్తే 30 ఏళ్లపాటు పాలిస్తా.. ఇవీ జగన్ గతంలోనే చెప్పిన మాటలు.. ప్రతి ఇంట్లోనూ నా తండ్రి ఫోటో పక్కన నా ఫోటో ఉండాలి.. ఇవి కూడా ఏపీ సీఎం జగన్ గతంలో చెప్పిన మాటలే.. ఇప్పుడు అవి నిజం కాబోతున్నాయట.. జగన్ క్రమంగా వేస్తున్న ఒక్కోఅడుగూ.. తన 30 ఏళ్ల పాలనకు పునాదులుగా మారబోతున్నాయట.

 

 

మరి జగన్ పై ఇంత పాజిటివ్ గా ఆలోచిస్తున్నది ఎవరనుకుంటున్నారా.. ఆయనే సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు. సాక్షి టీవీలో డిస్కషన్లు నిర్వహిస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావు తాజాగా జగన్ ప్రస్థానంపై ఓ సుదీర్ఘ వ్యాసం రాశారు. జగన్ ఇలాగే పాలిస్తే మరో 30 ఏళ్లు జగన్ దే అధికారం అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఎప్పుడూ చంద్రబాబును విమర్శించడం కాకుండా తాను అధికారంలోకి వస్తే ఏమి చేస్తానో చెప్పడం ద్వారా జగన్ పాజిటివ్ ఇమేజీ తెచ్చుకున్నారని ప్రశంసించారు.

 

 

ఆయన ఇంకా ఏంరాశారంటే.. “ జగన్ జనం ఆదరణ,విశ్వాసం చూరగొన్నారు.అదికార పీఠం అధిష్టించారు. ఆ తర్వాత ఆయన తాను చెప్పిన నవరత్నాలు అమలు చేసి చూపించారు. ఎన్నికల ప్రణాళికను అధికారుల ముందు, మంత్రుల ముందు, తన టేబుల్ పైన పెట్టుకుని వాటిని అమలు చేయాలని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి కూడా జగనే అవుతారు. రిలయన్స్ అదినేత ముకేష్ అంబానీ స్వయంగా వచ్చి జగన్ ను కలిసి ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వచ్చారంటేనే ఏపికి మంచి రోజులు వచ్చాయన్న అభిప్రాయం కలుగుతుంది.

 

 

" పార్టీని స్థాపించినప్పుడు జగన్ , ఆయన తల్లిగారు విజయమ్మ ఇద్దరే..ఇప్పుడు ఆయన పార్టీలో చేరడానికి ఎందరు ఎలా తరలి వస్తున్నారో గమనించవచ్చు. అదే ఆయన గొప్ప విజయం. ప్రజా విజయంతో పాటు రాజకీయ విజయం కూడా సాధించారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు పోలవరం, వెలిగొండ, తదితర నీటి ప్రాజెక్టులు పూర్తి చేసి, పరిశ్రమల స్థాపనకు గట్టి చొరవ తీసుకుని సఫలం అయితే గతంలో ఆయనే ఒక సందర్భంలో చెప్పినట్లు ముప్పైఏళ్లు ముఖ్యమంత్రిగా పాలన సాగించడానికి ఒక బలమైన పునాది వేసుకున్నట్లు అవుతుందంటూ ప్రశంసించారు కొమ్మినేని.

 

మరింత సమాచారం తెలుసుకోండి: