కరోనా.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. దీని దెబ్బకు అన్నిదేశాలు విల విల్లాడుతున్నాయి. వ్యాధి మరింతగా వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇండియా కూడా కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించింది. అదిగో అలా ప్రకటించినందువల్లే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆరు వారాలపాటు వాయిదా వేశారు.

 

 

అయితే రమేశ్ కుమార్ నిర్ణయం రాజకీయంగా పెను సంచలనం సృష్టించింది. స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక.. మరో పది రోజుల్లో పూర్తవుతుందనగా.. ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకోవడాన్ని సీఎం జగన్ తో పాటు పలువురు వైసీపీ నాయకులు తీవ్రంగా ఖడించారు. ఖండిస్తూనే ఉన్నారు. ఏపీలో కేవలం ఒకే ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. కనీసం ఒక్క మరణం కూడా లేదు.

 

 

కానీ అక్కడ ఏకంగా కరోనా కారణంగా 90 మందికి పైగా మరణించారు. అయితే అక్కడ మాత్రం కరోనా కారణంగా స్థానిక ఎన్నికలు ఆపలేదు. అదెక్కడ అంటారా.. అదే ఫ్రాన్స్. కరోనా వైరస్ తో సతమతమవుతున్న ప్రాన్స్ లో మాత్రం స్థానిక ఎన్నికలు యధావిధిగా జరిగాయి. ఫ్రాన్స్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ఆదివారం ప్రారంభమయ్యాయి. కరోనాతో ఆ దేశంలో ఇప్పటి వరకు 91మంది మరణించారు. మరో 2,900 మంది కరోనా బారిన పడ్డారు.

 

 

ఈ ఎన్నికల సందర్భంగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఫ్రాన్స్ లో కరోనా సృష్టించిన సంక్షోభం మొదటి దశలోనే ఉన్నామన్నారు. ఆదివారం నుంచి దేశంలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలను యథావిధిగా నిర్వహిస్తామని మెక్రాన్ ప్రకటించారు. మరి కరోనా గురించి తెగబాధపడుతున్న చంద్రబాబు.. ఈ విషయం తెలిస్తే దిమ్మతిరగడం ఖాయమంటున్నారు వైసీపీ నాయకులు. రమేశ్ కుమార్ తొందరపడ్డారేమో అనిపించక మానదంటున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: