ప్రస్తుతం యూరప్ దేశాల్లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి భారత్ నూ వణికిస్తోంది. మన దేశంలో అతి కొద్ది రోజుల్లోనే 114 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా మన పక్క దేశం పాకిస్తాన్ లో నిన్నటి వరకు సుమారు ఒక యాభై కేసులు మాత్రమే పాజిటివ్ ఉండవచ్చని అంతా ఊహించారు. అయితే కనీవినీ ఎరుగని రీతిలో నిన్న ఒక్కరోజులోనే పాకిస్తాన్ లో రికార్డు స్థాయిలో ఉన్న పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయని పాకిస్తాన్ మీడియా తెలిపింది. ఒక వైపు ప్రపంచ దేశాలన్నీ కరోనా ను అరికట్టేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటుంటే పాకిస్తాన్ వారు మాత్రం కొంచెం కూడా భయం లేకుండా ఇలా చేయడం ఇప్పుడు అందరినీ విస్మయపరుస్తోంది.

 

సరిగ్గా చెప్పాలంటే కేవలం 24 గంటల్లో 131 కేసులు పాకిస్థాన్లో నమోదైనట్లు కథనాలు బయటికి వచ్చేశాయి దీంతో పాకిస్తాన్ లో మొత్తం కరోనా పాకిటివ్ సంఖ్య భారత్ ను అధిగమించి 186 కి చేరింది. లెక్కలతో పాక్ ప్రజల గుండెల్లో గుబులు మొదలైంది. పాక్ వారు కరోనా ను ముందు నుండి లైట్ తీసుకున్నట్లు స్పష్టంగా కనపడుతోంది. లేకపోతే ఒక్క రోజులో అన్ని కేసులా...? ఇదే రేటుతో కనుక కరోనా పాకిస్తాన్ లో వ్యాపించడం మొదలుపెడితే ఒక్క నెల రోజులు తిరిగే లోపల పాకిస్తాన్ దేశం అంతా స్మశానం అయిపోతుంది అన్నది ఆరోగ్య నిపుణుల మాట.  

 

అయితే ఇప్పటికే మోదీ కరోనా పని పట్టేందుకు సార్క్ లో కొన్ని అద్భుతమైన ప్రతిపాదనలు చేయగా దానికి పాకిస్తాన్ కూడా మేము మీతో చేయి కలుపుతాం అంటూ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటువంటి సమయంలో కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే అన్ని కేసులు పాకిస్థాన్ లో నమోదు కావడం అనేది చాలా విచారించదగ్గ విషయం. కానీ ఇది వారి స్వయంకృత అపరాధమే..!

 

ప్రపంచ వ్యాప్తంగా 162 దేశాలకు కరోనా వైరస్ విస్తరించింది. దీని ప్రభావంతో ఇప్పటి వరకు 7,066 మంది చనిపోయారు. మరో లక్షా 80వేల మంది వైరస్ సోకడంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా చైనాలో కరోనా మరణాలు సంభవించాయి. చైనాలో ఇప్పటి వరకు 3,213 మంది చనిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: