మొత్తం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఎటువంటి బేధభావం లేకుండా ప్రపంచంలో ప్రతి ఒక్కరినీ తన వశం చేసుకునేందుకు బయలుదేరింది. ఇప్పటికే వేల సంఖ్యలో ప్రాణాలు బలి తీసుకున్న మహమ్మారి తన ప్రభావాన్ని మరీ ముఖ్యంగా పశ్చిమ దేశాల పై చాలా ఎక్కువగా చూపిస్తోంది. మనకంటే మామూలు మనుషులకి మరియు భయంకరమైన ఉగ్రవాదులకు, తీవ్రవాదుల మధ్య తేడా తెలుసు కానీ పాపం కరోనా వైరస్ కు మాత్రం ఏం తెలుసు? అందుకే ఉగ్రవాదులను కూడా వైరస్ మామూలుగా భయపెట్టడం లేదు.

 

తాజాగా మధ్యనే ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఒక స్టేట్మెంట్ ను రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా తమ కోసం పనిచేస్తున్న వారందరూ ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి అని వారికి సలహా. ఇచ్చింది అంతేకాకుండా వారిలో ఒక్కరికి వైరస్ ఉన్నట్లు కూడా అనుమానిస్తున్నారు. ఎప్పుడూ ఏదో ఒక దాడి జరగడానికి పశ్చిమ దేశాలలో దాక్కొని ఉండే ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ఇప్పుడు కరోనా దెబ్బకు తీవ్ర ప్రమాదంలో ఉన్నారు.  వారిలో ఎవరికో ఒకరికి కరోనా వైరస్ ఉండే అవకాశం ఉన్నందున వైరస్ వారి ఒళ్ళోకి వచ్చి వాలినా వారు అది సోకకుండా చాలా జాగ్రత్తగా తగిన చర్యలు తీసుకుంటున్నారు. అందుకే తమ మనుషులందరినీ చాలా శుభ్రంగా ఉండమని పదే పదే కోరుతున్నారు.

 

ఇకపోతే విషయం ఏమిటంటే ప్రస్తుతం ప్రపంచం మొత్తం వైరస్ కలిగించిన విపరీతమైన ఆర్ధిక మరియు ప్రాణ నష్టం నుంచి కోలుకొనే లోపే తమకు దీనివల్ల ఎలాంటి ముప్పు లేదు అని కన్ఫర్మ్ చేసుకున్నాక ఉగ్రవాదులు ఏదో భారీ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు రిపోర్టర్లు ఇచ్చాయి. సరిగ్గా వైరస్ మహమ్మారి వందల ప్రాణాలను బలి తీసుకుంటున్న సమయంలో పశ్చిమ దేశాలలో టైమ్ చూసి ఇదే అదనుగా దెబ్బకొట్టి ప్రపంచానికి తామేంటో తెలియచేయాలని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు విపరీతంగా కాచుకొని ఉన్నారట. ఏదైనా సమయంలో రెండు వైపుల నుంచి దాడి జరిగితే ప్రపంచం ఏమైపోతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: