అవును ఆ గంటసేపు అక్కడ ఏమి జరిగిందనే విషయం అందరిలోను టెన్షన్ పెంచేస్తోంది. విషయం జరిగి దాదాపు 24 గంటలు గడస్తున్నా ఏ విషయమూ బయటకు రాకపోవటంతోనే అందరిలోను టెన్షన్ పెరిగిపోతోంది.  ఇంతకీ విషయం ఏమిటంటే స్ధానిక సంస్ధల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదివారం ఉదయం ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.  ఇదే విషయమై జగన్మోహన్ రెడ్డి అదేరోజు మధ్యాహ్నం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి నిరసన కూడా అందరికీ తెలిసిందే.

 

జగన్ నిరసన తెలిపిన తర్వాత సోమవారం వచ్చి తనను కలవమని గవర్నర్ నిమ్మగడ్డను ఆదేశించారు. సోమవారం ఉదయం 10 గంటలకు నిమ్మగడ్డ గవర్నర్ ను కలిసి మొత్తం విషయం వివరించారు. అంతే గవర్నర్-నిమ్మగడ్డ మధ్య ఏమి జరిగిందనే విషయం ఇంత వరకూ బయటకు రాలేదు.  దాదాపు గంటపాటు స్ధానిక సంస్ధల ఎన్నికలను ఏ పరిస్ధితుల్లో వాయిదా వేయాల్సొచ్చిందో నిమ్మగడ్డ వివరించారు. కరొనా వైరస్ సమస్యను కూడా వివరించినట్లు సమాచారం.

 

సరే గంట భేటి తర్వాత నిమ్మగడ్డ మీడియాతో మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. ఏ విషయమూ మీడియాతో మాట్లాడకుండానే ఎందుకు వెళ్ళిపోయారు ? అనేదే ఎవరికీ అర్ధం కావటం లేదు. పైగా తమ భేటి విషయాన్ని ప్రెస్ రిలీజ్ రూపంలో తెలియజేస్తామని చెప్పారు. అయితే సోమవారం రాత్రి వరకూ ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదు. అసలు గవర్నర్ నిమ్మగడ్డను ఎన్నికలను యథాతధంగా నిర్వహించమని ఆదేశించారా ? లేకపోతే నిమ్మగడ్డ నిర్ణయాన్నే సమర్ధించారా ? అన్నదే సస్పెన్స్ గా మారింది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎన్నికల వాయిదాకు నిమ్మగడ్డ చెప్పిన కారణాలు ఎందుకూ పనికిరానివన్న విషయం అందరికీ తెలుసు. తాను తప్పు చేసిన విషయం నిమ్మగడ్డకూ తెలుసు. అందుకనే  ఎన్నికల కమీషన్ లో కూడా ఎవరికీ తెలీకుండానే మంత్రాంగాన్ని నడిపించారు. ఈ మొత్తం మీద చంద్రబాబునాయుడు చెప్పినట్లుగానే నిమ్మగడ్డ నడుచుకున్నారు అని జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఆరోపణ. పైగా రాష్ట్రప్రభుత్వానికి కనీసమాత్రంగా చెప్పకుండానే నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయం తీసేసుకున్నారు. దీన్నే జగన్ తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. మొత్తానికి  గవర్నర్ భేటి విషయాన్ని ఇంత వరకూ ఎందుకు గోప్యంగా ఉంచారో అర్ధం కావటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: