జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన పది నెలల్లో చాలా ఎదురు దెబ్బలే తిన్నాడు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడును తక్కువ అంచనా వేయటమే దీనికి ప్రధాన కారణం. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటేనే చాలా డక్కా మొక్కీలు తిన్న విషయం అందరికీ తెలిసిందే.  తన ప్రయోజనాల కోసం ప్రత్యర్ధి ఎంతటి వాడైనా కానీండి బురద చల్లేయటం, గబ్బు పట్టించటంలో చంద్రబాబును మించినోడు లేదనే చెప్పాలి.  మొదటి నుండి చంద్రబాబుకు నెగిటివ్ రాజకీయమే అన్న విషయం గుర్తుంచుకోవాలి.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే స్వతహాగా చంద్రబాబు బలవంతుడేమీ కాడు. పైగా బాగా పిరికివాడు. అందుకనే ప్రత్యర్ధులకు స్పాట్ పెట్టాలంటే చాలా ముందు జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇందులో భాగంగానే జగన్ పై అన్నీ వైపుల నుండి వ్యూహాలు రచిస్తు బురద చల్లేస్తున్నాడు. ఎటూ మీడియా బలముంది కాబట్టి బురద చల్లటమన్నది నిర్విజ్ఞంగా జరిగిపోతోంది.

 

మొదటి దెబ్బ శాసనమండలిలో సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లు, మూడు రాజధానుల బిల్లులు ఆమోదం పొందకుండా అడ్డం పడ్డాడు చంద్రబాబు.  జగన్ తో పాటు మంత్రులు,  సభ్యులు ఏదో అనుకుంటే చంద్రబాబు ఇంకేదో చేశాడు. జగన్ కానీ మంత్రులు కానీ ఊహించని రీతిలో  చంద్రబాబు దెబ్బ కొట్టాడు. ఇది జగన్ మొదటి ఫైల్యూర్ అనే చెప్పాలి. ఇక రెండోది తాజాగా స్ధానిక సంస్ధల ఎన్నికలను వాయిదా వేయటం. ఎంపిటిసి, జడ్పిటిసి, మున్సిపల్ వార్డులను ఏకగ్రీవం చేసుకోవటంలోనే వైసిపి నేతలు కాన్సంట్రేట్ చేశారు.

 

కానీ చంద్రబాబు మాత్రం ఏకంగా ఎన్నికలనే వాయిదా వేయించటంపై దృష్టి పెట్టాడు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఎక్కడ కూడా టిడిపి గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. ఎన్నికలను వాయిదా వేయించే ప్లాన్లో భాగంగానే క్షేత్రస్ధాయిలో గొడవలను టిడిపినే చేయించి వాటిని ఎన్నికల కమీషన్, డిజిపి ముందుంచారు. దీని ప్రకారం రెండు వ్యవస్ధలు యాక్షన్ తీసుకోకపోతే చివరకు కరోనా వైరస్ ను బూచిగా చూపించి ఎన్నికలను వాయిదా వేయించటంలో సక్సెస్ అయ్యాడు. చంద్రబాబు దెబ్బకు జగన్ కు నిజంగానే మైండ్ బ్లాంక్ అయ్యిందనే అనుకోవాలి.

 

మొత్తానికి చంద్రబాబు అంటే ఏమిటో జగన్ కు ఈ పాటికే ఫుల్లుగా అర్ధమైపోయుండాలి. ఈ అనుభవంతోనే  భవిష్యత్తులో చంద్రబాబు విషయంలో ఏ విధంగా  వ్యవహరించాలో జగన్ ఓ వ్యూహంతో ముందుకెళ్ళాలి.  ఏదైనా విషయం టేకప్ చేయాలంటే ఇకనుండి చంద్రబాబు  వ్యూహాలకు ముందుగానే విరుగుడు ఆలోచించే రంగంలోకి దిగాలి. పనిలో పనిగా జగన్ కాస్త ఆవేశాన్ని కూడా తగ్గించుకుంటే చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: