కరోనా వైరస్ క్రమంగా ఇండియాలోనూ తన సత్తా చూపుతోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. అక్కడ కొన్ని నగరాల్లో కరోనా వ్యాప్తి జోరందుకుంటోంది. అందుకే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. ఒక్క ముంబయిలోనే 14 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 39 మంది కరోనా బారిన పడ్డట్లు ధ్రువీకరించారు.

 

 

కరోనా వ్యాప్తిలో నాలుగు కీలక దశలు ఉన్నాయి. ప్రస్తుతం ఇండియాలో రెండో దశ నడుస్తోంది. ఇప్పుడు కట్టడి చేయకపోతే ముందు ముందు మరీ కష్టం అవుతుంది.

భారత్‌లో రెండో దశలో ఉన్న కరోనా వైరస్‌ వ్యాప్తిని ఇక్కడే కట్టడి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. మూడో దశ అయిన సమూహ వ్యాప్తి స్థాయికి చేరితే చైనా, ఇటలీ, ఇరాన్‌ తరహాలో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

 

చివరకు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు 144 సెక్షన్ కూడా విధించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. మహారాష్ట్రలోని ప్రధాన నగరమైన నాగ్‌పూర్‌లో 144 సెక్షన్‌ విధించారు. ఎలాంటి సామాజిక, రాజకీయ, సాంస్కృతిక సమావేశాలు నిర్వహించొద్దని నగర పోలీస్‌ జాయింట్‌ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ర్యాలీలు, నిరసన ప్రదర్శనలకు కూడా అనుమతి ఇవ్వడం లేదు.

 

 

దేవాలయాలు, చర్చిలు, మసీదులకు గుంపులుగా వెళ్లడం ఆపేయాలని సూచించారు. రానున్న 15 నుంచి 20 రోజులు చాలా కీలకమని వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలంటే ప్రజలు ప్రభుత్వంతో సహకరించాలని పోలీసులు, అధికారులు కోరుతున్నారు. విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, దుకాణ సముదాయాలు, క్రీడా పోటీలు, భారీ సభల్ని నిషేధించారు. అత్యవసరమైతే తప్ప దూర ప్రయాణాలు పెట్టుకోవద్దని చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: