ప్రపంచంలో కొంతమంది డబ్బు సంపాదించడమే పరమావధిగా ఉంటున్నారు. డబ్బు సంపాదించే క్రమంలో తాము సమాజంలో బతుకుతున్న మనుషులం అన్న విచక్షణ మరచిపోతున్నారు. ఎందుటివారిని ఎలా మోసం చేయాలి.. ఎలా దోచుకోవాలి అన్న కోణంలో సాగిపోతున్నారు.  డబ్బు సంపాదన కోసం ఎన్నో దారుణాలు.. అన్యాయాలకు పాల్పపడుతున్నారు. ఇందులో ముఖ్యంగా హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్ దందా, సైబర్ క్రైమ్ తో పాటు మానవ అక్రమ రవాణాతో డబ్బులు సంపాదిస్తున్నారు.  సెప్టెంబర్‌ 2, 2015లో సముద్ర తీరంలో అచేతనంగా పడి ఉన్న చిన్నారి కుర్దీ చిత్రం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్‌ అయింది. 

 

 

ఆ ఫోటో చూసిన ప్రతి తల్లిదండ్రులు కంట నీరు పెట్టుకున్నారు.  దీనంగా పడి ఉన్న చిన్నారు మృత దేహం చూస్తుంటే ఎంత కఠినాత్ములకైనా కన్నీరు రావడం ఖాయం.  ఫొటో బయటకు వచ్చిన తర్వాతే శరణార్థుల అంశంపై ప్రపంచ దేశాలు స్పందించాయి.  అయితే దీని వెనుకు ఎంతో విషాదమైన క్రైమ్ ఉంది. శరణార్థుల పరిస్థితి ఎంత హృదయ విదారకంగా ఉంటుందో.. సముద్రతీరానికి కొట్టుకొచ్చిన మూడేళ్ల చిన్నారి అలెన్‌ కుర్దీ మృతి ప్రపంచానికి తెలియజేసింది. మానవ అక్రమ రవాణా చేస్తూ కుర్దీతో సహా మరికొందరి మరణానికి కారణమైన ముగ్గురికి 125 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 

 

కాగా, కుర్దీ కుటుంబం టర్కీ నుంచి గ్రీకు చేరుకోవాలనుకునే క్రమంలో 8 మంది పరిమితి కలిగిన ఒక ప్లాస్టిక్‌ బోట్‌లో 16 మందిని ఎక్కించి ఈ ప్రమాదం జరిగేందుకు కారకులయ్యారు. ఆ బోటు తీరం నుంచి కదిలిన కొన్ని నిమిషాలకే సముద్రంలో మునిగిపోయింది. ఒక్క కుర్దీ కుటుంబాన్ని అక్రమంగా తరలించేందుకే వారు 6వేల డాలర్లు వసూలు చేశారు. నేరం రుజువు కావడంతో ఆ చిన్నారి చావుకు కారణం అయిన నేరస్థులకు టర్కిష్‌ కోర్టు ఇలాంటి  కీలక తీర్పును వెల్లడించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: