టాలీవుడ్ లో ప్రస్తుతం కొత్త దర్శకుల ట్రెండ్  నడుస్తున్న విషయం తెలిసిందే. ఎంతో మంది కొత్త దర్శకులు తెర మీదికి వచ్చి తమ సత్తా నిరూపించుకుంటూ ఎంతో మంది ప్రేక్షకులకు ఫేవరెట్ డైరెక్టర్ గా మారిపోతున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది కొత్త దర్శకులు వచ్చారు. అంతేకాదు యువ దర్శకులందరూ తమదైన శైలిలో సినిమాలు తీస్తు ఎంటర్టైన్మెంట్ కల్పిస్తున్నారు. ఇలా దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి ప్రస్తుతం డైరెక్టర్ గా తన ప్రస్థానాన్ని  విజయవంతంగా కొనసాగిస్తూ... ఓటమెరుగని యువ దర్శకుడిగా  దూసుకుపోతున్నారు అనిల్ రావిపూడి. ప్రస్తుతం టాలీవుడ్ లో అనిల్ రావిపూడి మేనియా నడుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. 

 

 

 అయితే నాటి తరం ప్రేక్షకులు... నేటి తరం ప్రేక్షకుల సినిమా చూసే  విధానానికి ఎంతో తేడా ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే నేటి తరం ప్రేక్షకుల పల్స్  తెలుసుకుని దానికి అనుగుణంగా సినిమాలు తీస్తూ... ప్రస్తుతం తనకు తిరుగు లేదు అని నిరూపించుకున్నాడు అనిల్ రావిపూడి. మొదట పటాస్ సినిమా తో నందమూరి కళ్యాణ్ రామ్  తెరకెక్కించి అటు అనిల్ రావిపూడి మంచి విజయం అందుకోవడం తో పాటు మరోవైపు అటు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న కళ్యాణ్ రామ్ కి  కూడా మంచి విజయాన్ని అందించాడు. ఇక ఆ తర్వాత సుప్రీం సినిమాతో అటు మెగాహీరోకి కూడా మంచి విజయాన్ని అందించాడు. 

 

 

 ఇక ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ రాజా ది గ్రేట్ సినిమాను తెరకెక్కించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు అనిల్ రావిపూడి. ఇక గతేడాది సీనియర్ హీరో వెంకటేష్ మెగా హీరో వరుణ్ తేజ్ తో మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించి... ఫన్  అండ్ ఫ్రస్టేషన్ అంటూ అందరినీ కడుపుబ్బ నవ్వించి మరో విజయాన్ని అందుకుంది. ఇక మొన్నటికి మొన్న ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఛాన్స్ కొట్టేసి... సంచలన విజయాన్ని అందుకుని సరిలేరు నీకెవ్వరు అని నిరూపించాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం అటు ప్రేక్షకులు కూడా ఆయన రావుపూడి ట్రెండ్  ఫాలో అవుతున్నారు. అనిల్ రావిపూడి ఏ సినిమాని తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ విజయాన్ని కట్టబెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: