ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ భారతదేశంలో కూడా ప్రజలను గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకు కరోనా వైరస్ వ్యాప్తి భారతదేశంలో పెరిగిపోతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అయితే ఈ కరోనా  వైరస్ కు  సరైన వ్యాక్సిన్ కూడా లేకపోవడంతో మరింత భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు. ఇక ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు సరైన వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటిస్తే సరిపోతుంది అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన చర్యలు చేపడుతున్నాయి. అంతేకాకుండా కరోనా  రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై కూడా ప్రజలకు తెలిసేలా చేసేందుకు ఎన్నో చర్యలు చేపడుతున్నాయి. దీంతో ప్రజల్లో కరోనా వైరస్ పై అవగాహన పెరుగుతుంది అనే లోపే... మరో మహమ్మారి ప్రజలను మరింత ప్రభావితం చేస్తోంది. 

 

 

 ఈ మహమ్మారి ఏదో కాదు సోషల్ మీడియా... ఇది కరోనా వైరస్ కంటే మరింత ప్రమాదకరంగా మారి పోయింది ప్రస్తుతం నేటి రోజుల్లో. కరోనా  వైరస్ కారణంగా ఇప్పటికే భారత ప్రజలు అందరూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఇక దీన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది సోషల్ మీడియాలో విస్తృత ప్రచారాన్ని వైరల్ చేస్తున్నారు. దీంతో కరోనా వైరస్ గురించి అటు ప్రభుత్వం చెబుతున్నది  నమ్మాల  లేకపోతే సోషల్ మీడియాలో వచ్చిన సమాచారాన్ని నమ్మాలా అనే అయోమయంలో పడిపోతున్నారు జనాలు. ఇక తాజాగా ఇలా కరోనా  వైరస్ పై  వదంతులు వ్యాప్తి చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. పట్టణానికి చెందిన కొంతమంది కరోనా బారిన పడ్డారని... కరోనా  వైరస్ సోకినప్పటికి నిర్లక్ష్యం చేయడంతో ఓ వ్యక్తి మరణించాడు అంటూ సారాంశం ఉన్న కొన్ని వార్తలను  సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ముగ్గురు వ్యక్తులు.

 

 

 అంతేకాకుండా చనిపోయిన ఆ వ్యక్తికి సంబంధించి కొంత మంది బంధువులను కూడా గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు అంటూ ఫేక్ న్యూస్ ని షేర్ చేశారు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన పోలీసులు హ్యాపీ బర్త్ డే  పవన్ అనే వాట్సప్ గ్రూపు లో ఫేక్ వార్తలను గుర్తించారు. ఒక వ్యక్తి బెడ్ పై ఉన్న ఫోటోని షేర్ చేస్తూ అతనికి కరోనా  సోకిందని... చికిత్స పొందుతూ చనిపోయాడని... ప్రచారం జరుగుతున్నా గ్రూప్ కి భరత్ అనే వ్యక్తి అడ్మిన్ గా ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. ఆ గ్రూపులో శివకుమార్ బాలరాజు అనే వ్యక్తులు ఈ ఫోటోలను షేర్ చేసినట్లుగా గుర్తించారు. ఇక ఇది వాట్సాప్ లో వైరల్ గా మారిపోయింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అడ్మిన్  భరత్ తో  పాటు... వార్తలు పోస్ట్ చేసిన శివ బాలరాజు ను కూడా అరెస్టు చేశారు. ఇక నిందితుల మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారికి జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విదించే  అవకాశం ఉందని అంటున్నారు. ఎవరైనా ఇలాంటి ఫేక్ వార్తలు పోస్ట్ చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: