కొరోనా ఈ పేరు వింటేనే జనాలు బెంబేలెత్తున్నారు. కరోనా వైరస్.. ఇదో ప్రాణాంతక వైరస్.. దీని పేరు వింటే చాలు.. ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తోంది. ఎప్పుడు ఏ క్షణంలో ఈ వైరస్ ఎటాక్ చేస్తుందోనన్న భయమే అందరిని బెంబేలిత్తిస్తోంది. డేంజరస్ వైరస్ వేగంగా విజృంభిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది. చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన ఈవేల మంది ప్రాణాలను బలి తీసుకుంది. అనేక మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. అసలు కరోనా వైరస్ ఎలా పుట్టుకు వచ్చింది? ఈ వ్యాధి రావడానికి గల కారణాలు ఏంటి..? 

 

 

కరోనా వైరస్ పుట్టుక పాముల నుంచే సంక్రమించింది అనడానికి ఎక్కువ ఆధారాలు కనిపిస్తున్నాయి. అయితే, పాములకు మనుషులకు సంబంధమేంటి ? పాముల నుంచి మనుషులకు ఎలా ఈ వైరస్ సంక్రమించిందంటే.. చైనాలోని వుహాన్ సిటీలో ఎక్కువగా పాములను ఆహారంగా తింటుంటారు. అక్కడి మార్కెట్లలో చేపలు, పందులు, గాడిద మాంసంతో పాటు పాముల మాంసం కూడా అమ్ముతుంటారు.

 

 

ఆ పాముల మాంసం తినడం ద్వారా వాటిలోని వైరస్ మనుషుల్లోకి సంక్రమించినట్టు ఇప్పటికే చైనాలోని పెకింగ్​ యూనివర్సిటీ ఆఫ్​ హెల్త్​ సైన్స్​ సెంటర్​ తమ అధ్యయనంలో వెల్లడించింది. గబ్బిలాల్లో ఉండే జీన్స్​ కాంబినేషన్​తో ఈ కొత్త కరోనా పుట్టుకొచ్చిందని సైంటిస్టులు తేల్చేశారు. పాముల్లోని జీన్స్​తోనూ వాటిని పోల్చి చూడగా, ఒకేలా ఉన్నట్టు గుర్తించారు.

 

 

కరోనా వైరస్ అనేది.. ఒక ఆకారం నుంచి పుట్టింది. ఇది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఉపయోగించి పరీక్షించినప్పుడు.. కిరీటం లేదా సౌర కరోనాను పోలి ఉంటుంది. కిరీటం ఆకారం నిర్మాణ వివరాల ఆధారంగా కరోనావైరస్ పేరు పెట్టారు. కరోనా వైరస్.. గాలి ద్వారా వ్యాప్తిస్తుంది. ప్రధానంగా క్షీరదాలు, పక్షుల ఎగువ శ్వాసకోశ, జీర్ణశయాంతర ప్రేగులకు సోకుతుంది. కరోనావైరస్ సోకినవారిలో ప్రారంభంలో తేలికపాటి ఫ్లూ లాంటి లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: