చంద్రబాబునాయుడు హయాంలో  చక్రం తిప్పిన ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావుకు గట్టి దెబ్బ తగిలింది. తనను సస్పెండ్ చేయటం అన్యాయమంటూ క్యాట్ ను ఏబి ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఏబిని సస్పెండ్ చేయటంలో తప్పేమీ లేదని క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్) స్పష్టగా తీర్పు చెప్పింది. సస్పెంన్షన్ విషయంలో ఏమన్నా చెప్పుకోవాల్సుంటే కేంద్రప్రభుత్వంతో మాట్లాడుకోవచ్చని కూడా చెప్పేసింది. అంటే ఏబిని సస్పెండ్ చేయటంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పేమీ చేయలేదని క్యాట్ తేల్చి చెప్పినట్లైంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే చంద్రబాబు హయంలో ఏబి ఏ స్ధాయిలో చక్రం తిప్పింది అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే ఇజ్రాయెల్ నుండి ద్రోన్ పరికరాలను కొనుగులో చేయటంలో నిబంధనలకు నీళ్ళు వదిలారన్నది ఏబిపై ప్రధానమైన ఆరోపణ. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు హయాంలో రూ. 25 కోట్లకు పెట్టిన ఆర్డర్లను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. ద్రోన్ల సరఫరా అవకాశం వచ్చింది ఏబి వెంకటేశ్వరరావు కొడుకు కంపెనీకే అన్న విషయం బయటపడింది.

 

ఎప్పుడైతే ద్రోన్ల కుంభకోణం విషయం బయటపడిందో వెంటనే జగన్ ప్రభుత్వం ఏబిపై కేసు నమోదు చేసింది. అప్పటికే ఏబికి చాలా కాలంగా పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం ఖాళీగా కూర్చోపెట్టింది. దీనిపైన ద్రోన్ల వ్యవహారం చుట్టుకుంది. విచిత్రమేమిటంటే ద్రోన్ల కాంట్రాక్టును ఖరారు చేసే కమిటిలో ఏబి కూడా సభ్యునిగా ఉండటం. అంటే తండ్రి కమిటిలో సభ్యునిగా ఉన్నపుడు కొడుకు కంపెనీకి ఆర్డర్లు రాకుండా ఎక్కడకు పోతుంది ? కాబట్టి కొడుకు కంపెనీకి ఆర్డర్లు వచ్చేసింది.

 

సరే ఎలాగా ఆ ఆర్డర్లను జగన్ ప్రభుత్వం రద్దు చేసినా కేసు పెట్టి విచారణ జరిపింది. తర్వాత సస్పెండ్ కూడా చేసింది. ఈ విషయంలోనే ఏబి క్యాట్ ను ఆశ్రయించాడు. అయితే ప్రభుత్వ చర్యలనే క్యాట్ సమర్ధించింది. తాజాగా క్యాట్ నిర్ణయంతో ఏబి ఏమి చేస్తాడో చూడాల్సిందే. ఏదేమైనా నిజం నిలకడమీదైనా తెలుస్తుందని తేలింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: