చైనా లోని వుహాన్ నగరంలో మొట్ట మొదటి కరోనా కేసు గుర్తించబడిన కొన్ని నెలల్లోనే అది ప్రపంచ దేశాలకు సంక్రమించి అందర్నీ గడగడలాడిస్తుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 142 దేశాలలో ఒక లక్షా 75 వేల మందికి ఈ ప్రాణాంతక వైరస్ సోకగా... 7007 మంది ప్రాణాలను కోల్పోయారు. ఐతే చనిపోయిన 7007 మందిలో చైనీయుల కంటే ఇతర దేశస్తులు ఎక్కువమంది ఉన్నారని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దొర్లేవి, ఈదేవి, పాకేవి, ఎగిరేవి అంటూ డిస్కవరీ ఛానల్ లో కనిపించని జీవులను కూడా తినేసి వైరస్ సృష్టి కి కారణమైన చైనా వారి వలన ప్రాణనష్టం కలగడంతో పాటు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది.




ఏఎఫ్‌పీ వార్తాసంస్థ  గణాంకాల ప్రకారం చైనాలో 3,213 మంది ప్రాణాలు కోల్పోగా, ఇటలీలో 2,158, ఇరాన్‌లో 853, స్పెయిన్‌లో 297 మంది కరోనా వైరస్ మహమ్మారి వలన ప్రాణాలను వదిలారు. కరోనా వైరస్ ఎవరికైనా వచ్చిందని అనుమానం వస్తే వారికి వెంటనే చికిత్స చేయడం చాలా ముఖ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు ఇచ్చింది.




కరోనా వైరస్ సంక్రమణని అరి కట్టేందుకు అనేక దేశాలతో పాటు మన దేశం కూడా ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటుంది. ఇప్పటికే వందకు పైగా కరోనా కేసులు ఇండియాలో నమోదు కాగా ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో కరోనా కేసులు చాలా తక్కువగా నమోదవుతున్నప్పటీ... రోజురోజుకు దాని ప్రభావం ఎక్కువవుతుంది. ఫ్రాన్స్ లో మొదటిగా 12 కేసులు నమోదుకాగా కేవలం పదిరోజుల్లోనే కరోనా బాధితుల సంఖ్య 4000కి పెరిగింది. ఇరాన్ దేశంలో కరోనా బాధితుల సంఖ్య 12, 700 కి పెరగగా ఇటలీలో ఏకంగా 24 వేలకు చేరుకుంది. అగ్రరాజ్యం అమెరికాలో కూడా కరోనా వైరస్ కేసుల సంఖ్య మూడు వేలు దాటింది. ఏది ఏమైనా కరోనా వైరస్ తమ దేశంలో అదుపులోకి వచ్చినట్టు చైనా ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇతర దేశాలలో మాత్రం కరోనా సంక్రమణ అదుపు చేయలేని పరిస్థితిలో సంక్రమిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: