చైనాలో మొదలైన కరోనా విధ్వంసం ఇప్పుడు ప్రపంచం అంతా గాయం చేస్తుంది.. మనుషుల తలరాతలను దేవుడు నిర్ణయిస్తాడంటారు.. కానీ ఇప్పుడున్న పరిస్దితుల్లో చైనా, ప్రపంచం మొత్తాన్ని నాశనం చేస్తుంది.. చైనా వాడి దత్తపుత్రిక అయినా కరోనా, ఖండాలు దాటి మనుషుల శ్వాసను ఖండ ఖండాలుగా చేస్తుంది.. మనిషి సక్రమంగా జీవించాలంటే ఊపిరితిత్తులు ఆరోగ్యవంతంగా ఉండాలి కాని ఆ ఊపిరి.. ఊపిరినే తీస్తున్న కరోనా వల్ల దేశంలో అనిశ్చితస్దితి నెలకొంది..

 

 

దీనివల్ల ప్రపంచ దేశాలన్ని సరిహద్దులను మూసివేస్తుండటమే కాకుండా కఠిన నిబంధలను అమలు చేస్తున్నాయి.. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం కూడా యూరోపియన్‌ యూనియన్, బ్రిటన్, టర్కీ నుంచి వచ్చే ప్రయాణికులు భారత్‌లో ప్రవేశించడంపై మార్చి 31 వరకూ నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భారత్‌లో క్రమక్రమంగా కోవిడ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతున్న కారణంగా, సోమవారం ఆరోగ్య శాఖ అధికారులు ఈ ముందు జాగ్రత్త చర్య తీసుకున్నట్లు తెలిపారు. ఇక మార్చి 18న అర్ధరాత్రి నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుందని సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు.

 

 

ఇదే విధంగా దేశ అంతర్జాతీయ సరిహద్దుల ద్వారా అన్ని రకాల ప్రయాణికుల రాకపోకలను, సోమవారం నుంచి నిషేధించారు. ఇక దేశం మొత్తమ్మీద వైరస్‌ నియంత్రణ చర్యల పుణ్యమా అని జిమ్‌లు, సినిమాహాళ్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, కొన్ని చోట్ల దేవాలయాలు, ఉద్యోగ సంస్దలు, పాఠశాలలు వంటివి దాదాపు అన్ని రాష్ట్రాల్లో మూసేశారు. ఇక ప్రజారవాణ వ్యవస్ద మాత్రం యధాతధంగా సాగుతుంది.. కాగా ఇక్కడి నుండి కూడా కరోనా వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలని ఇప్పటికే అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు..

 

 

ఇక ప్రజల ఉపయోగార్ధం సోమవారం నుంచి కొత్త టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు.. ఈ నంబర్ ద్వారా కరోనాకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఇదివరకు అందుబాటులో ఉన్న 011– 23978046 తో పాటు 1075 నంబర్‌కు ఫోన్‌ చేయడం ద్వారా కోవిడ్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చునని ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ఇంకా ఏమైనా అనుమానాలుంటే ncov2019 @gmail. comకు ఈ మెయిల్‌ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: