సీనియర్ ఐపీఎస్ అధికార ఏబీ వెంకటేశ్వర రావుకు  కేంద్ర పరిపాలన ట్రెబ్యునల్ (క్యాట్ )లో చుక్కెదురైంది . తన సస్పెన్షన్ ను  సవాల్ చేస్తూ , వెంకటేశ్వర రావు క్యాట్ ను ఆశ్రయించిన విషయం తెల్సిందే . గత ప్రభుత్వ హయం లో నిఘా విభాగం చీఫ్ గా పని చేసిన  ఏబీ వెంకటేశ్వరరావు పలు అవతవకలకు పాల్పడ్డారన్న కారణంగా  రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని   సస్పెన్షన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది . రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంకటేశ్వరరావు క్యాట్ లో సవాల్ చేశారు . రాష్ట్ర ప్రభుత్వం తనని  సస్పెన్షన్ చేస్తూ, తీసుకున్న నిర్ణయాన్ని కొట్టి వేయాలని  వెంకటేశ్వరరావు  క్యాట్ ను కోరారు .

 

అయితే వెంకటేశ్వరావు పిటిషన్ ను విచారణానంతరం క్యాట్ కొట్టివేసింది . సర్వీస్ నిబంధనలకు అతిక్రమించి వెంకటేశ్వరరావు నిర్ణయం తీసుకున్నారన్న అభియోగం పై ఆయన్ని విధుల్లో నుంచి వైస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించింది . భద్రతా ఉపకరణాల కొనుగోలులో అతిక్రమణలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది . ప్రజా ప్రయోజనాల రీత్యా ఆయన పై సస్పెన్షన్ వేటు వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో వెల్లడించింది . 1989 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన వెంకటేశ్వరరావు వివిధ హోదాల్లో పని చేశారు .

 

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు అత్యంత సన్నిహితుడన్నది నిర్వివాదాంశం . గత ప్రభుత్వ హయాం లో నిఘా విభాగం చీఫ్ గా పనిచేసిన వెంకటేశ్వరరావు , వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల అపరేషన్ ఆకర్ష్ లో కీలకపాత్ర పోషించారని అభియోగాలు ఉన్నాయి . అందుకే వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే వెంకటేశ్వరరావు పై వేటు ఖాయమని అందరూ భావించారు . అనుకున్నట్లుగానే జగన్ సర్కార్ ఆయన్ని సస్పెన్షన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది .  

మరింత సమాచారం తెలుసుకోండి: