ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితి ఎలా ఉందొ చెప్పనక్కర లేదు. దీనికి కారణం రోజురోజుకి దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఎలా పెరుగుతున్నాయి వాటి సంఖ్య తెలుపుతుంది. నిన్నటికి దేశ వ్యాప్తంగా 120 పైగా కేసులు నమోదయ్యాయి. అందులో మొత్తానికి ముగ్గురు ప్రాణాలు కూడా వీడారు. ఇలా ప్రపంచ మహమ్మారి అయినా కరోనా దేశంలో చాలా వేగంగా పెరుగుతోంది.

IHG

 


దీని దెబ్బకి దేశంలోని అనేక పనులకి, పరిశ్రమలకి ఇలా ఒకటేంటి అన్ని రంగాలను ఇది ప్రభావితం చేసింది అని చెప్పవచ్చు.  ఈ వైరస్ వలన మాల్స్, స్కూల్స్ ఇలా అనేక రకాల చోట్ల ఎక్కడైతే మనుషులు ఎక్కువగా గుమిగూడుతారో అక్కడ సెలవులు ప్రకటించారు. దీని వలన క్రీడా రంగంలో జరవలిసిన అనేక వాటిని పూర్తిగా రద్దు కూడా చేసారు. ఇవ్వన్నీ ఆలా ఉంటె ప్రస్తుతం ఈ కరోనా ఎఫెక్ట్ దేవుడి పై కూడా పడింది. 

IHG

 

ఇక అసలు విషయానికి వస్తే వచ్చే నెల ఏప్రిల్ లో భద్రాచలంలో జరగవలిసిన రాముల వారి కల్యాణానికి కూడా ఈ దెబ్బ పడింది. ఈ కళ్యాణం చూడడానికి అక్కడికి పెద్ద ఎత్తులో ప్రజలు అక్కడకి వస్తుంటారు కనుక ఈ వైరస్ వ్యాపించడానికి అదుపు ఉండకపోవచ్చు. కాబట్టి ఈసారి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేమిటంటే... అర్చకులతో మాత్రమే కళ్యాణం నిర్వహించాలని. భద్రాచలానికి భక్తులు రావద్దని ప్రభుత్వం చెబుతుంది. ఈ నిర్ణయంతో భద్రాచలంలో కల్యాణ ఏర్పాట్లను నిలిపివేయనునట్లు అధికారులకు ప్రభుత్వం సూచించింది.

 

 

 

ఏది ఏమైనా ఈ కరోనా దెబ్బ దేవుడికి కూడా తగలడం నిజానికి బాధాకరమైన విషయమే. ఏది ఏమైనా కరోనా వైరస్ వ్యాప్తి చెదనుకుండా తగిన చర్యలు పాటించి దాని నిర్ములానికి సహకరించడానికి మన వంతు ప్రయత్నం చేద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: