చైనాలో పుట్టిన కారోనా ప్రస్తుతం తన ప్రభావాన్ని ప్రపంచ దేశాలపై చూపిస్తోంది. దాదాపు అన్ని దేశాలలో దీని పంజా విసురుతోంది. ఈ కరోనా వైరస్ వలన మృత్యువాత పడిన వారు చాల మంది ఉన్నారు. ఈ వైరస్ బారిన పడి ఇండియాలో  ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు. కాగా., తాజాగా ఈరోజు మహారాష్ట్రకు చెందిన 64 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. దీంతో ప్రభుత్వంలో ఆందోళన చోటు చేసుకుంది. ఈయన వైరస్ బారిన పడి ముంబైలోని కస్తుర్బా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా., ఆయన కొద్దిసేపటి క్రితమే చనిపోయాడు. ఇప్పటికే భారత్ లో మూడు కరోనా మృతులు సంఖ్య మూడు చేరుకొంది. 


కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి, ఢిల్లీకి చెందిన ఒక మహిళ, ఇప్పుడు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి చనిపోయారు. భారత్ లో మొత్తం కరోనా కేసుల 128కి చేరడం గమనార్హం. వీరిలో 109 మంది ఆసుపత్రులలో ట్రీట్ మెంట్ పొందుతున్నారు. కాగా, మహారాష్ట్రకు చెందిన వ్యక్తి మృతి చెందడంతో ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సహ్మాద్రి అతిథి గృహంలో దీనికి సంబంధించిన అధికారులతో కరోనాను అదుపులో పెట్టేందుకు పటిష్ఠ చర్యలపై చర్చిస్తున్నారు. తాజాగా ఇండియాలో 103 మంది భారతీయులు, మిగతావాళ్లు విదేశీయులు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తాజా లెక్కల ప్రకారం తెలిపారు.


ప్రస్తుతం ఇప్పుడు ఇండియాలోనే అధికంగా కరోనా కేసులు (39 ) మహారాష్ట్రలో కేసులు ఉన్నాయి. తర్వాత అధికంగా కేరళలో 24, హర్యానాలో 14, ఉత్తరప్రదేశ్‌ లో 13 కేసులు ఉన్నాయి. ఇదిలా ఉండగా కర్ణాటకలో కరోనా వైరస్ బాగా పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడ 8 కేసులున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 5 కేసులు నమోదవ్వగా.. తెలంగాణలో మొత్తం 4 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒక వ్యక్తిని డిశ్చార్జి చేసి పంపారు. మిగతా వారిని ఆసుపత్రులలో ట్రీట్‌ మెంట్ పొందుతున్నారు. ఏపీలో ఒక పాజిటివ్ కేసు నమోదు అయింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: