కరోనా వైరస్ కేసుల సంఖ్య భారతదేశంలోనే 128 చేరుకుంది. తాజాగా కేరళ ఒడిశా, లడఖ్, జమ్మూ కాశ్మీర్ లో మూడు కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా వ్యాప్తిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే మలేషియా, ఆఫ్ఘనిస్తాన్, ఫిలిపైన్స్ దేశాల నుండి వస్తున్న ప్రయాణికులను ఈరోజు మధ్యాహ్నం నుండి భారతదేశం అనుమతించడం లేదు. అలాగే యునైటెడ్ కింగ్డమ్, యూరప్ దేశాల నుండి వస్తున్న ప్రయాణికులను భారత దేశంలోకి అడుగు పెట్టేందుకు అనుమతించడం లేదు.




ఆరోగ్యశాఖ కి సంబంధించిన జాయింట్ సెక్రెటరీ 'లవ్ అగర్వాల్' మాట్లాడుతూ... యూరప్, కువైట్, ఉమెన్, టర్కీ, బ్రిటన్ దేశం నుండి వస్తున్న ప్రయాణికులను మార్చి 18వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు అనుమతించం. ఇండియా కి వచ్చే ఏ ఒక్క విమానము మేము మొదటి గా చెప్పిన దేశాల ప్రయాణికులను ఎక్కించుకో కూడదు', అని చెప్పారు. ఒకవేళ భారతీయులు నిషేధించిన దేశాల నుండి వస్తే వారిని కనీసం 14 రోజుల పాటు ఐసోలేషన్ వార్డులో ఉంచనున్నారు.

 

 

వాస్తవానికి కరోనా వైరస్ సంక్రమిస్తుందనే భయంతో అమెరికా దేశం తో పాటు మిగతా దేశాలు కూడా ఇతర దేశస్తులను తమ దేశంలోకి అనుమతించడం లేదు. ఇప్పటికే చైనా ఇటలీ, ఇరాన్, కొరియా, ఫ్రాన్స్, జర్మనీ నుండి భారతదేశానికి వచ్చేసిన భారతీయులను ఐసోలేషన్ వార్డులో మార్చి 13 వ తేదీ నుంచి ఉంచి వారిని పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ ఆరోగ్య శాఖ మంత్రులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే తప్ప కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం అసాధ్యం అని చెబుతున్నారు. చివరాఖరికి ఫోన్ రింగ్ టోన్ లు కూడా కరోనా వైరస్ వ్యాప్తి గురించి చెబుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి.

 




మార్చి 11వ తేదీన ఇండియా కొన్ని మినహాయించి అన్ని వీసాలను తాత్కాలికముగా రద్దు చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర గవర్నమెంట్ తమ రాష్ట్రంలో తాజాగా నలుగురికి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించామని... ప్రస్తుతం మొత్తం 39 కేసులు నమోదయ్యాయని తెలిపింది.




మరింత సమాచారం తెలుసుకోండి: