క‌రోనా వైర‌స్‌.. ఎంత భ‌యంక‌ర‌మైందో ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌లంద‌రికీ తెలిసిన విష‌యమే! అం దుకే ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా భ‌యాన‌క ఆందోళ‌న‌లు మిన్ను ముడుతున్నాయి. అంద‌రూ హ‌డలి పోతున్నారు కూడా. ప్ర‌భుత్వాల‌కు ప్ర‌భుత్వాలే అలెర్ట్ అవుతున్నాయి. ప్ర‌జ‌లు త‌మ విందులు, వినోదాలు వాయిదా వేసుకుంటున్నారు. మూడుముళ్ల‌తో ఒక్క‌ట‌వ్వాల‌ని క‌ల‌లు క‌న్న యువ‌తీయువ‌కులు వివాహాల‌ను సైతంవాయిదా వేసుకుంటున్నారు. సినిమా హాళ్లు మూత‌ప‌డుతున్నాయి. ఇలా ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌దుల సంఖ్య‌లో దేశాలు నిషేధాజ్ఞ‌లు విధించి ప్ర‌జ‌ల‌ను అలెర్ట్ చేస్తున్నాయి.

 

అయితే, క‌రోనా కార‌ణంగా.. ఎవ‌రైనా హ్యాపీగా ఉన్నారా? ఎవ‌రైనా క‌రోనా మరింత‌గా పెరిగితే బాగుంటుంది అనుకుంటున్నారా? క‌రోనా వ‌చ్చింద‌ని సంతోషం వ్య‌క్తం చేస్తున్నారా? అంటే.. ఒకే ఒక్క నాయ‌కుడు అది కూడా ఫార్టీ ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండస్ట్రీ అని చెప్పుకొనే మాజీ సీఎం చంద్ర‌బాబు మాత్ర‌మే ఇలా ఆలోచి స్తున్నారని అంటున్నారు ప‌రిశీల‌కులు. క‌రోనా ప్ర‌జ‌లంద‌ర‌కీ పెద్ద పెను ముప్పుగా ప‌రిణ‌మించింద‌ని అంద రూ త‌ల‌లు బాదుకుంటుంటే.. చంద్ర‌బాబు మాత్రం క‌రోనాతో పెద్ద రిలీఫ్ వ్య‌క్తం చేస్తున్నారు. క‌రోనా రావ‌డాన్ని ఆయ‌న చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నార‌ట‌!

 

విన‌డానికే ఈ ప‌రిణామం ఎబ్బెట్టుగా అనిపించినా.. బాబు విష‌యంలో మాత్రం ఇది నిజం అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా స్థానిక ఎన్నిక‌లు వాయిదా ప‌డ్డాయి. అది కూడా దాదాపు ఆరు వారాల పాటు వాయిదా వేశారు. ఇది ఎవ్వ‌రూ ఊహించ‌ని ప‌రిణామం. ప్ర‌భుత్వం అయితే, వాయిదాపై నిప్పులు చెరుగుతోంది. ఇక‌, స్థానిక ఎన్నిక‌ల్లోపోటీకి నిలిచిన ప్ర‌జాప్ర‌తినిధులు కూడా ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

 

కానీ, ఈ వాయిదా కార‌ణంగా త‌న పార్టీ పుంజుకుంటుంద‌ని, పార్టీని బ‌లోపేతం చేసుకునేందుకు స‌మ‌యం చిక్కింద‌ని చంద్ర‌బాబు మాత్రం సంతోషిస్తున్నార‌ట‌. మొత్తానికి ఆయ‌న అనుభ‌వం ఇలా ప‌నికి వ‌చ్చింద‌ని సోష‌ల్ మీడియాలో స‌టైర్లు పేలుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి బాబోరు ఈ ఆరు వారాల‌ను ఎలా వాడుకుని త‌మ పార్టీ ప‌రువు కాపాడు కుంటారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: