భారత్ లో కరోనా పరిస్థితి ఎలా ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ఎందుకంటే రోజురోజుకి దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఎలా పెరుగుతున్నాయి వాటి సంఖ్య తెలుపుతుంది. నేటికి దేశ వ్యాప్తంగా 122 పైగా కేసులు నమోదయ్యాయి. అందులో మొత్తానికి 3 ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇలా ప్రపంచ మహమ్మారి అయిన కరోనా దేశంలో చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది.

 

 


దీని దెబ్బతో దేశంలోని అనేక పనులకి, ఇంత రంగాలకి ఇలా ఒకటేంటి అన్ని రంగాలను ఇది ప్రభావితం చేసింది అని చెప్పవచ్చు.  ఈ వైరస్ వలన మాల్స్, స్కూల్స్ ఇలా అనేక రకాల చోట్ల ఎక్కడైతే మనుషులు ఎక్కువగా గుమిగూడుతారో అక్కడ వాటిని మూసివేస్తూ వస్తున్నారు. ఈ వైరస్ దెబ్బతో క్రీడా రంగంలో జరగాల్సిన అనేక వాటిని పూర్తిగా రద్దు కూడా చేశారు. ఇవి ఇలా ఉంటే ప్రస్తుతం ఈ కరోనా ఎఫెక్ట్ దేవుడి పై కూడా పడింది. 

 

 

ఇక అసలు విషయానికి వస్తే మహారాష్ట్రలోని షిరిడి ఆలయంలోకి భక్తులకి రావద్దని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ మంగళవారం ప్రకటించింది. దీనికి కారణం దేశంలో అన్ని రాష్ట్రాలకంటే అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదు అవుతున్నాయి. దీనితో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి తర్వాతి ఆదేశాలు జారీ చేసే వరకు భక్తులకు సాయి బాబా  దర్శన భాగ్యం ఉండబోదని బాబా తెలిపింది. దింతో దేవుడి దర్శనాన్ని వాయిదా వేసుకోవాలని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆదివారం భక్తులను ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతానికి మహారాష్ట్ర రాష్ట్రంలో ఇప్పటి వరకూ 39 మంది కరోనా  వైరస్ సోకగా అందులో ముంబైలో 64 ఏళ్ల వృద్ధుడు ఒకరు కరోనా కారణంగా ప్రాణాలు విడిచాడు.


ఇంకో అచైరకరమైన విష్యం ఏమిటంటే ప్రముఖ పర్యాటక ప్రాంతమైన తాజ్ మహల్‌ ను మూసివేస్తూ నిర్ణయం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది ఏమైనా ప్రజలు ఎప్పటికప్పుడు కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: