సోష‌ల్ మీడియా విస్తృతి పెరిగిపోయిన నేటి రోజుల్లో నాయ‌కుల‌పై అనేక కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. మంచైనా.. చెడైనా కూడా ప్ర‌జ‌లు వెనువెంట‌నే స్పందిస్తున్నారు. త‌మ అభిప్రాయాల‌ను పంచుకుం టున్నా రు. తాజాగా రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై కూడా ప్ర‌జ‌లు ఇలానే సోష‌ల్ మీడియాలో త‌మ అభిప్రా యాలు వ్య‌క్తం చేస్తున్నారు. స్థానిక ఎన్నిక‌లు వాయిదా ప‌డ‌డం స‌హా క‌రోనా ఎఫెక్ట్‌.. రాజ‌కీయ నేత‌ల వ్యాఖ్య‌ల‌కు ప్ర‌జ‌లు త‌మ‌దైన శైలిలో కౌంట‌ర్లు ఇస్తున్నారు. రాష్ట్రంలో క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా స్థానిక ఎన్నిక‌ల‌ను ఆరు వారాలు వాయిదా వేశారు.

 

వెంట‌నే ఈ ప‌రిణామాన్ని స్వాగ‌తిస్తూ.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్రెస్‌మీట్ పెట్టేశారు. క‌రోనా వ‌ల్ల ప్ర‌జ ల‌కు ఇబ్బంది ఉంద‌ని చెబుతూనే ఎన్నిక‌ల‌ను వాయిదా వేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న నొక్కి వ క్కాణించారు. అంతేకాదు, తానే ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌కు ఈ ఐడియా ఇచ్చాన‌ని కూడా చెప్పుకొన్నారు.(గ‌తంలోనూ పెద్ద నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో తానే ఐడియా ఇచ్చాన‌ని చెప్పుకొని ప్ర‌జ‌ల‌తో ఛీకొట్టించుకున్న విష‌యం బాబు మ‌రిచిపోయిన విష‌యం ప్ర‌స్తావ‌నార్హం.) అయితే, దీనిపై ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనికి కార‌ణం ఉంది.

 

ఎన్నిక‌ల కోడ్ కార‌ణంగా ప్ర‌భుత్వం నుంచి ప్ర‌జ‌ల‌కు అందాల్సిన ఇళ్ల పంపిణీ నిలిచిపోయింది. ప‌లు ప‌థ‌కాలు ఆగిపోయాయి. ముఖ్యంగా విద్యార్థుల‌కు అందాల్సిన జ‌గ‌న‌న్న విద్యాదీవెన వంటి ప‌థ‌కాలు నిలిచిపోయాయి. దీంతో ఎన్నిక‌ల కోడ్‌ను మ‌రింత పెంచ‌డంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేకత వ‌స్తోంది. అయితే, ఇవేవీ ప‌ట్టించుకోకుండానే చంద్ర‌బాబు.. ఎన్నిక‌ల వాయిదా వెనుక త‌న ప్ర‌తిభే ఉంద‌ని చెప్పుకోవ‌డంపై ప్ర‌జ‌లు సోష‌ల్ మీడియా వేదిక‌గా బాబుపై స‌టైర్లుకుమ్మేస్తున్నారు.

 

మ‌రీ ముఖ్యంగా 14వ ఆర్థిక సంఘం సిఫార‌సుల మేర‌కు రాష్ట్రానికి రావాల్సిన నిధులు రూ.4 వేల కోట్ల పైచిలుకు ఆగిపోయే ప్ర‌మాదం ఉంద‌నే విష‌యం ప్ర‌జ‌ల్లోకి బాగా వెళ్లింది. దీంతో బాబుపై మ‌రింత‌గా కారాలు మిరియాలు నూరుతున్నారు. ప్ర‌పంచ బూచిని త‌న‌కు అనుకూలంగా మార్చుకున్నాన‌ని బాబు సంబ‌ర ప‌డుతున్నా.. ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త‌ను ఆయ‌న అంచ‌నా వేయ‌డంలో విఫ‌లమ‌య్యార‌నేది నిజం!

మరింత సమాచారం తెలుసుకోండి: