ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుందన్న  విషయం తెలిసిందే. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయిపోయింది. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యే లోపే ఆంధ్ర రాజకీయాల్లో ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం ఆంధ్ర రాజకీయాల్లో మరింత సంచలనంగా మారిపోయింది. అయితే ఎన్నికల సంఘం నిర్ణయాన్ని తప్పుబడుతూ జగన్ సర్కార్ విమర్శలు చేయడంతో పాటు న్యాయపోరాటం కూడా చేస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి అంటే అధికార పార్టీకి కాస్త తలనొప్పి మొదలవుతుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంటు ఎన్నికలప్పుడు కేవలం కొంతమంది నేతలు పదవుల కోసం ఆశిస్తూ ఉంటారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం పదవుల కోసం ఆశిస్తున్న వారు భారీ సంఖ్యలోనే ఉంటారు. 

 

 ముఖ్యంగా అధికార పార్టీ నుంచి ఈ ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎవరికి పార్టీ నుంచి టికెట్  కేటాయించాలనే దానిపై పార్టీ ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు స్థానిక నేతల నుంచి అధికార పార్టీకి కూడా నిరసన సెగలు తగులుతూ ఉంటాయి. తాజాగా హోంమంత్రి సుచరిత కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. హోంమంత్రి సుచరిత కు సొంత పార్టీలోనే నిరసన సెగ తగిలింది. వైసిపి కార్యకర్తలు గుంటూరులోని హోంమంత్రి సుచరిత ఇంటిని ముట్టడించారు. ఈరోజు ఉదయం సమయంలో భారీ సంఖ్యలో హోంమంత్రి సుచరిత ఇంటి వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చారు వైసీపీ కార్యకర్తలు. 

 

 

 స్థానిక సంస్థల ఎన్నికల్లో 27 డివిజన్ టికెట్ ను రౌడీ షీటర్ కబ్జాదారుడు  అయిన వ్యక్తికి ఇచ్చారంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు వైసిపి కార్యకర్తలు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఇచ్చిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదంటూ ఈ సందర్భంగా వైసిపి కార్యకర్తలు అందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రౌడీషీటర్ కబ్జాదారుడు అయిన వ్యక్తికి  కేటాయించిన టికెట్లను రద్దు చేసి పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా శ్రమిస్తున్న యోగేశ్వర్ రెడ్డికి టికెట్ కేటాయించాలి అంటూ డిమాండ్ చేశారు కార్యకర్తలు. ఈ నేపథ్యంలోనే భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న వైసిపి కార్యకర్తలు హోంమంత్రి సుచరిత ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించగా వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: