చైనా దేశంలో వెలుగులోకి వచ్చి ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్నది కరోనా  వైరస్. ఇప్పటికే వేల సంఖ్యలో ప్రాణాలను బలి తీసుకుని.. ఇంకా ఎంతో మందిని ఆసుపత్రుల పాలు చేసింది ఈ మహమ్మారి. ఇక రోజురోజుకు ఈ ప్రాణాంతకమైన వైరస్ పై  ప్రజలు భయం పెరిగిపోతూ వస్తోంది. ఇప్పటికే కరోనా  వైరస్ ప్రభావం వల్ల 150 దేశాలకు పైగా ఈ వైరస్ విస్తరించింది. ఇక ఆయా దేశాల ప్రభుత్వాలు కూడా అప్రమత్తమై పోయే ముందు జాగ్రత్త చర్యలు కూడా చేపడుతున్నాయి. ఇక కొన్ని దేశాలలో అయితే ఈ మహమ్మారి వైరస్ విజృంభిస్తోంది. ఎంతోమంది మందిని పొట్టన పెట్టుకుంది. ఇక ఈ వైరస్ పై  రోజురోజుకు ప్రజల్లో భయం నాటుకుపోతుంది. 

 

 

 ఇక దీని అంతం చేయడానికి అటు శాస్త్రవేత్తలు విరుగుడు కనిపెట్టేందుకు గత రెండు మూడు నెలలుగా తీవ్రంగా శ్రమిస్తున్న ఇప్పటికీ ఎలాంటి ఫలితం మాత్రం దక్కడం లేదు. అయితే ఇప్పుడిప్పుడే అక్కడ అక్కడ ఈ వైరస్ కు విరుగుడు వినియోగంలోకి వచ్చిన పూర్తి స్థాయిలో మాత్రం ఫలిస్తుందని నమ్మకం మాత్రం ఎవరికి  లేదు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ఎమర్జెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా  వైరస్ కు మందు లేదని కేవలం ముందు జాగ్రత్త చర్యలు మేలు అంటూ సూచిస్తోంది. మాస్కులు ధరించడం తోపాటు చేతులను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పిస్తోంది. ఇక ఈ వైరస్ కారణంగా ప్రజలు ఏర్పడుతున్న ప్రాణభయం విపరీత పరిస్థితులకు కూడా దారితీస్తుందనే  అనుమానాలు రేకెత్తుతున్నాయి. 

 

 

 ఇందుకు కారణం గన్స్ తదితర ఆయుధాల కొనుగోలు ఒక్కసారిగా పెరిగిపోవడమే. ఆయా దేశాలలో కరోనా  వ్యాప్తి నేపథ్యంలో ముందుగానే నిత్యవసర వస్తువులను కొనుగోలు చేసి ఇళ్లలో పెట్టుకుంటున్నారు ప్రజలు . అయితే అమెరికాలో నిత్యవసర వస్తువులు కాదు ఆయుధాలకు కొనుగోలు కూడా బాగా పెరిగింది. లైసెన్స్ గన్స్,  పిస్తోళ్లను విక్రయించే దుకాణాలకు అమెరికా వాసులు బారులు తీరుతున్నారు. ముఖ్యంగా అమెరికాలోని పలు నగరాలలో ఈ గన్స్ కొనుగోలు ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి... దొంగలు ఇళ్లలోకి చొరబడి దోపిడి చేసే అవకాశాలు ఉన్నాయని అక్కడి ప్రజలు భయ పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో తమ రక్షణ నిమిత్తం ముందుగా ఆయుధాలు కొనుగోలు చేసి తమ వద్ద పెట్టుకుంటున్నారని భావిస్తున్నారు అక్కడి విశ్లేషకులు. అయితే ఆత్మ రక్షణ కోసం ఆయుధాలు పెట్టుకోవడం తప్పేమీ లేదని కానీ... అసాంఘిక కార్యకలాపాల కోసం ఆయుధాలను పెట్టుకుంటే మాత్రం ప్రమాదం అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: