కరోనా.. కరోనా.. కరోనా ... ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. ఈ పేరు ఎత్తితే చాలు ప్రజలందరూ ప్రాణభయంతో వణికిపోతున్నారు. సోషల్ మీడియాలో ఈ పేరు కనిపిస్తే చాలు అయోమయంలో మునిగిపోతున్నారు. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుని... ఇంకెంతో మంది ని ఆసుపత్రుల పాలు చేసింది ఈ మహమ్మారి వైరస్. చైనాలో ముందుగా వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి వైరస్... ప్రస్తుతం ప్రపంచ దేశాలకు శరవేగంగా పాకుతూ... అన్ని దేశాలను చిగురుటాకుల్ల  వణికిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ ప్రాణాంతకమైన వైరస్ మాత్రం ఎక్కడ తగ్గుముఖం పట్టినట్లు మాత్రం కనిపించడం. దీంతో అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అత్యవసరపరిస్థితిని ప్రకటించిన విషయం తెలిసిందే. 

 

 

 కరోనా కు  సరైన మందు లేదని నివారణ ఒక్కటే మార్గం అంటూ సూచించింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇక ఇప్పటికే వంద దేశాలకు పైగా ఈ మహమ్మారి వైరస్ విస్తరించి అందరిని ప్రాణభయంతో వణికిస్తోంది. ముఖ్యంగా ముందు జాగ్రత్త చర్యలు పాటించక పోతే మాత్రం ప్రమాదమే అని చెబుతున్నారు వైద్యులు. అయితే కరెన్సీ నోట్ల వల్ల కూడా కరోనా  వ్యాప్తి చెందే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. అయితే భారతదేశంలో కూడా కరోనా  వైరస్ శర వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే ఈ మహమ్మారి వైరస్ వల్ల ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కాగా ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... కాంటాక్ట్  లెస్  పేమెంట్ సిస్టం ను ఉపయోగించాలని ప్రజలను కోరుతుంది. 

 

 

కరెన్సీ నోట్ల వాడకం ద్వారా కరోనా  వ్యాపించే అవకాశం ఉన్నందున.. ఆన్లైన్ పేమెంట్ విధానాలను ఎక్కువగా ఉపయోగించాలి అంటూ bank OF INDIA' target='_blank' title='ఆర్బిఐ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఆర్బిఐ సూచిస్తోంది. ముఖ్యంగా నెఫ్ట్, ఐఎంపిఎస్, బిబిపిఎస్ యూపీఐ లాంటి విధానాలను ఉపయోగించాలంటూ సూచిస్తోంది. వీటివల్ల ట్రాన్సాక్షన్ లకు పూర్తి భద్రత ఉండటంతోపాటు సులభంగా చెల్లింపులు జరపవచ్చని..కరోనా  గురించి భయపడాల్సిన అవసరం కూడా ఉండదు అని పేర్కొంది. ఈ సేవలు రోజులో ఏ సమయంలోనైనా అందుబాటులో ఉంటాయి అంటూ తెలపింది . కరోనా ను  అరికట్టేందుకు పబ్లిక్ ప్లేస్ లోకి వెళ్లకూడదని సూచించింది ఆర్బిఐ. మొబైల్ బ్యాంకింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాంటి సేవలను ఉపయోగించుకుని డిజిటల్ పేమెంట్ చేయాలంటూ తెలిపింది. కరోనా  నియంత్రణకు కాంటాక్ట్ లెస్  పేమెంట్స్ ఎంతో మేలు అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: