ప్రపంచంలో ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ ఏపి మీద చూపిస్తున్నట్లుంది.  భారత దేశంలో కరోనా విస్తరిస్తుందని తెలుగు దేశం పార్టీ నేతలు స్థానిక ఎన్నికలు జరపకుండా ఎన్ని విధాలుగా ప్రయత్నించాలో అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు అధికార పార్టీ వైసీపీ నేతలు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు నెలలు వాయిదా పడడంపై టీడీపీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.  కరోనా అంటూ వీళ్లే జనాలను సమీకరిస్తున్నారు.. ఎక్కడ బడితే అక్కడ తమ దిక్కుమాలిన సందేశాలు ఇస్తూ ప్రజల్లో లేని పోని భయాలు సృష్టిస్తున్నారు.   

 

కరోనా వైరస్ వల్ల ప్రమాదం అని అందరికీ తెలిసిందే.. కానీ అంతకన్నా ప్రమాదం జనాల మనోభావాలతో ఆడుకోవడం అన్నారు.  పచ్చ పార్టీ నేతలు బయట బాగానే తిరుగుతున్నారు. పెళ్లిళ్లు, పేరంటాలకు వెళ్తున్నారు. మీడియా కాన్ఫరెన్సులు పెడుతున్నారు.  ఇవన్నీ చేస్తున్న వీరికి మాత్రం జనాలకు కరోనా గురించి ఏం సందేశం ఇష్తున్నారో అర్థం కావడం లేదు.. ఇక కరోనా బూచిని చూపి ఎలక్షన్లు మాత్రమే వాయిదా వేయడం మంచి నిర్ణయమట. దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేయ్ అన్నట్టుంది వీళ్ల వ్యవహారం.  ముందు ముందు ఇంకా వీళ్లు చేసే చిత్ర విచిత్రాలు ఎన్ని చూడాల్సి వస్తుందో అని ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి. స్థానిక ఎన్నికలను వాయిదా వేయించి గెలిచినట్టు ఫీలవుతున్నాడు చంద్రబాబు.

 

ఆరు వారాలు వాయిదా అంటే ఇక ఎలక్షన్లు ఉండవని కాదు బాబూ. నాయకులు పార్టీ వీడిపోతుంటే ఈ దిక్కుమాలిన పనికి ఒడిగట్టావు. నీ కుట్రలన్నింటికీ ప్రజలు తగిన శిక్ష విధించే రోజులు ఎంతో దూరం లేవు' అని ట్వీట్ చేశారు.  ఏపిలో ఎన్నికలు ఇప్పుడు కాదు ఇంకా ఎన్ని వాయిదాలు వేసినా ఒకనాటికి ఎన్నికలు జరిపిస్తే వైసీపీ పార్టీ అఖండ విజయం సాధిస్తుంది.. ఇది ముమ్మాటీకి జగమెరిగిన సత్యం అని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: